ఎన్నికల కోసం పెళ్లి.. మహిళా రిజర్వేషన్ దక్కించుకోవడానికి.. !!

By AN TeluguFirst Published Apr 1, 2021, 1:08 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రావడంతో ఆ సీటు ఎలాగైనా గెలవాలనే కాంక్షతో ఓ 45యేళ్ల వ్యక్తి అప్పటికప్పుడు వివాహం చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రావడంతో ఆ సీటు ఎలాగైనా గెలవాలనే కాంక్షతో ఓ 45యేళ్ల వ్యక్తి అప్పటికప్పుడు వివాహం చేసుకున్నాడు.

తన తరఫున తన భార్యను పోటీలోకి దింపి గెలవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు లేనప్పటికీ అవేమీ పట్టించుకోకుండా మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు. 

వివరాల్లోకి వెల్తే.. బాలియా జిల్లాలోని కరణ్ చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్ (45) గత కొన్నేళ్లుగా తమ గ్రామంలో సామాజిక సేవ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు. గ్రామాభివృద్ధికోసం ఎంతగానే పాటు పడుతున్న హథీసింగ్ ఈ యేడాది పోటీ చేద్దామనుకున్నాడు. కానీ ఆ సీటు మహిళకు రిజర్వ్ కావడంతో ఢీలా పడ్డాడు. 

ఆ గ్రామానికి సర్పంచ్‌గా  మహిళను  రిజర్వ్ చేశారు. అయినా ఎలాగైనా గెలవాలని ఆయన మద్దతుదారులు, సహచరులు పెళ్లి చేసుకోమని సూచించారు. దీన్ని హథీసింగ్ అమలు చేశాడు.

అనంతరం హథీసింగ్ మాట్లాడుతూ.. తమ గ్రామానికి మూడో దశలో భాగంగా ఎప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి  ముహూర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని, కానీ గ్రామాభివృద్ధి కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు.
 

click me!