ఫేస్ మసాజర్ లో రూ. 20లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్..

Published : Apr 01, 2021, 12:27 PM IST
ఫేస్ మసాజర్ లో రూ. 20లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్..

సారాంశం

రోజూ కిలోల కొద్దీ బంగారం కస్టమ్స్ వాళ్లకు పట్టుబడుతున్నా స్మగ్లర్లు మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా ఓ స్మగ్లర్ ఫేస్ మసాజర్ లో రూ. 20లక్షల విలువైన బంగారాన్ని తీసుకెల్తూ దొరికిపోయాడు. 

రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. ఆ ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు అతని వద్దనున్న ఫేస్ మసాజర్ లో 436 గ్రాముల బంగారం లభించింది. 

ఫేస్‌ మసాజర్‌తోపాటు అతని దగ్గరున్న మరో చిన్న పోర్టబుల్ స్పీకర్ లోని గుండ్రని అయస్కాంతంలో కూడా బంగారాన్ని దాచాడు. దాన్ని కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఫిబ్రవరి నెలలో కూడా జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనే జరిగింది. షూలో రూ.70 లక్షల విలువైన బంగారాన్ని పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్న ఒక ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్