యూపీలో 9 విమానాశ్రయాలు ఉన్నాయి.. మరో 11 ఎయిర్‌పోర్ట్‌లకు పనులు జరుగుతున్నాయి.. సీఎం యోగి ఆదిత్యానాథ్

By team teluguFirst Published Oct 20, 2021, 3:29 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో 9 విమానాశ్రయాల సంఖ్య 9కి చేరిందని సీఎం యోగి  ఆదిత్యనాథ్  అన్నారు. రాష్ట్రంలో  ప్రస్తుతం రెండు అంతర్జాతీయ ఏరోడ్రోమ్‌లతో సహా 11 కొత్త విమానాశ్రయాల పనులు జరుగుతున్నాయని చెప్పారు.

నేడు ప్రధాని  నరేంద్ర మోదీ ఖుషీ నగర్  అంతర్జాతీయ  విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో రాష్ట్రంలో  పూర్తిస్థాయిలో పనిచేసే  విమానాశ్రయాల సంఖ్య  తొమ్మిదికి  చేరిందని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. బుధవారం  ఉత్తరప్రదేశ్‌లోని Kushinagar International Airport  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  బుధవారం ప్రారంభించిన  సంగతి తెలిసిందే. ఈ  ప్రారంభోత్సవ  కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పౌర విమానయాన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, , శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స, అధికారులు, ఇతర  ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం యోగి  ఆదిత్యనాథ్  మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో 9 విమానాశ్రయాలు ఉన్నాయని  అన్నారు. రాష్ట్రంలో  ప్రస్తుతం రెండు అంతర్జాతీయ ఏరోడ్రోమ్‌లతో సహా 11 కొత్త విమానాశ్రయాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. బుద్దిస్ట్ సర్క్యూట్‌లో పర్యాటకాన్ని  పెంపొందిస్తామని, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.  

అయోధ్య విమానాశ్రయానికి సంబంధించిన పనులు కూడా పురోగతిలో ఉన్నాయని Yogi Adityanath గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ బలపడుతోందని, ఇది అభివృద్ధికి ప్రేరణనిస్తుందని అన్నారు. లుంబిని, సారనాథ్, శ్రావస్తి, రాజ్‌గిర్, సంకిసాచ వైశాలి, గయలో తీర్థయాత్ర స్థలాలను కలిపి పిలిచే బౌద్ధ సర్క్యూట్ కు కుశినగర్ కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బుద్ద భగవానుడితో సంబంధం ఉన్న  ప్రదేశాలను అభివృద్ది చేయడానికి, అక్కడికి రవాణా  సౌకర్యాలు  కల్పించడానికి, భక్తలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చూసేందుకు భారత  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద  వహిస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం, కేంద్ర  ప్రభుత్వం  ఇందుకు అధిక ప్రాధ్యాతత ఇస్తున్నట్టుగా చెప్పారు. ఖుషీ  నగర్  ఎయిర్‌పోర్ట్  ఆ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ  అభివృద్ది చెందడానికి, కొత్త ఉద్యోగ అవకాశాలు  సృష్టించడానికి దోహదపడుతుందని PM Narendra Modi అన్నారు.

Also read: ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ.. అక్కడి నుంచి తొలి ఫ్లైట్.. 

ఖుషీ  నగర్‌లో జరిగిన  ఓ కార్యక్రమంలో కేంద్ర  పౌర విమానయాన శాఖ  మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) మాట్లాడుతూ.. ‘ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో మేము ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాము. ఇది ఉత్తర ప్రదేశ్‌లో 9వ విమానాశ్రయం. రాబోయే  రోజుల్లో రాష్ట్రంలో మరో 17 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 70 సంవత్సరాలలో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏడేళ్ల  పాలనలోనే ప్రభుత్వం 54 విమానాశ్రయాలను విజయవంతంగా ప్రారంభించింది.  ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఖుషీ  నగర్‌కు విమానాశ్రయానికి వారానికి నాలుగు సార్లు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వీసులు నవంబర్ 26 న ప్రారంభమవుతాయి. త్వరలోనే కోల్‌కతా, ముంబై విమానాశ్రయాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్  నడిపే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని అన్నారు.

click me!