ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ.. అక్కడి నుంచి తొలి ఫ్లైట్..

By team teluguFirst Published Oct 20, 2021, 12:57 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ అంతర్జాతీయ  విమానాశ్రయాన్ని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  బుధవారం ప్రారంభించారు. ఈ  ప్రారంభోత్సవ  కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పౌర విమానయాన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, , శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స, అధికారులు, ఇతర  ప్రముఖులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ అంతర్జాతీయ  విమానాశ్రయాన్ని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  బుధవారం ప్రారంభించారు.  శ్రీలంకలోని కొలంబో నుంచి వచ్చిన విమానం.. Kushinagar International Airportలో ల్యాండ్  అయిన తొలి విమానంగా నిలిచింది. ఇందులో 100 మందికిపైగా బౌద్ధ భిక్షవులు, ప్రముఖులు ఉన్నారు. ఈ  ప్రారంభోత్సవ  కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పౌర విమానయాన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, , శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స, అధికారులు, ఇతర  ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బుద్ద భగవానుడితో సంబంధం ఉన్న  ప్రదేశాలను అభివృద్ది చేయడానికి, అక్కడికి రవాణా  సౌకర్యాలు  కల్పించడానికి, భక్తలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చూసేందుకు భారత  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద  వహిస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం, కేంద్ర  ప్రభుత్వం  ఇందుకు అధిక ప్రాధ్యాతత ఇస్తున్నట్టుగా చెప్పారు. ఖుషీ  నగర్  ఎయిర్‌పోర్ట్  ఆ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ  అభివృద్ది చెందడానికి, కొత్త ఉద్యోగ అవకాశాలు  సృష్టించడానికి దోహదపడుతుందని PM Narendra Modi అన్నారు.  

ఈ విమానాశ్రయంతో కలిపితే  ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 9 ఎయిర్‌పోర్ట్స్, టెర్మినల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని మోదీ అన్నారు. దేశంలో అతిపెద్ద  విమానాశ్రయంగా  నిలవనున్న జెవార్  ఎయిర్‌పోర్ట్ పనులు అతి వేగంతో సాగుతున్నాయని.. త్వరలోనే అది  ప్రజలకి అందుబాటులో  వస్తుందని అన్నారు. 

‘ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయం దశాబ్దాల ఆశలు, అంచనాల ఫలితం. ఈ రోజు నా ఆనందం రెట్టింపు అయింది. నాకు సంతృప్తిగా ఉంది. పూర్వాంచల్ ప్రాంత ప్రతినిధిగా, ఇది నెరవేరడానికి సమయం.. ఒక కమిట్‌మెంట్‌ను  పూర్తి చేసిన  సమయం. ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రైతులు, జంతు సంరక్షణదారులు, దుకాణదారులు, కార్మికులు, స్థానిక పారిశ్రామికవేత్తలు అందరూ ప్రయోజనం పొందుతారు. ఇది వ్యాపార వ్యవస్థను సృష్టిస్తుంది. పర్యాటకం గరిష్ట ప్రయోజనాన్ని పొందుతుంది. ఇది ఇక్కడ యువతకు ఉపాధిని సృష్టిస్తుంది ”అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమత అనుచరులకు కుశీనగర్ ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు మహాపరినిర్వాణం చెందారు. దీంతో ఖుషీ నగర్ బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన యాత్రా ప్రదేశాలలో ఒకటి. అందుకే  ఖుషీ నగర్‌కు విదేశాల నుంచి ప్రయాణసదుపాయాలు కల్పించే భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఇక, స్పైస్  జెట్ త్వరలోనే  ఖుషీ నగర్, ఢిల్లీ ల మధ్య డైరెక్ట్ ఫ్లైట్  సర్వీసులను ప్రారంభించనుంది. 

Also read: యాదాద్రి ఆల‌యానికి వైసీపీ జ‌డ్పీటీసీ కిలో బంగారం విరాళం.. కేసీఆర్‌కు థాంక్స్

ఇక, 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ  అత్యాధునిక అంతర్జాతీయ ఎయిర్ పోర్టును నిర్మించారు. ఇందుకోసం దాదాపు రూ. 260 ఖర్చు చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ  ఆఫ్ ఇండియా (Airports Authority of India), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government)  ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివ‌ద్ది చేశాయి.

click me!