Lakhimpur Kheri : ‘ఇది అంతులేని కథలా సాగకూడదు..’ యూపీ ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు..

By AN TeluguFirst Published Oct 20, 2021, 2:21 PM IST
Highlights

ఈ కేసులో సంబంధం ఉన్న అందరు సాక్షుల వాంగ్మూలాన్ని protect చేయాలని, రికార్డ్ చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఇంకా చెబుతూ "ఇది అంతులేని కథ కాకూడదు" అని వ్యాఖ్యానించింది. ఏ ఏ నేరానికి సంబంధించి, ఎవరెవరు అరెస్టయ్యారు.. అనే విషయాలమీద status report ఇవ్వాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీలో జరిగిన నిరసనలో రైతుల హత్యపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కఠినమైన ప్రశ్నలు వేసింది. "మిమ్మల్నెవరో ఇందులోకి లాగుతున్నారనే భావనను వదిలేయండి" అని కఠినంగా హెచ్చరించింది.

ఈ కేసులో సంబంధం ఉన్న అందరు సాక్షుల వాంగ్మూలాన్ని protect చేయాలని, రికార్డ్ చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఇంకా చెబుతూ "ఇది అంతులేని కథ కాకూడదు" అని వ్యాఖ్యానించింది. ఏ ఏ నేరానికి సంబంధించి, ఎవరెవరు అరెస్టయ్యారు.. అనే విషయాలమీద status report ఇవ్వాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

"మెటీరియల్ వస్తుందని మేము నిన్న రాత్రి 1 గంట వరకు వేచి ఉన్నాం " అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ యుపి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేతో అన్నారు.

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు Ashish Mishra అక్టోబర్ 3 న జరిగిన నిరసన కార్యక్రమంలో రైతులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ చర్యపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన మూడు రోజుల తర్వాత అక్టోబర్ 11 న ఆశిష్ మిశ్రాను అరెస్టు చేశారు. Salve నిన్న సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించారని చెప్పారు.

"చివరి నిమిషంలో ఇలా దాఖలు చేస్తే, మేం దాన్ని ఎలా చదవగలం? కనీసం ఒక రోజు ముందు దాఖలు చేయండి" అని Chief Justice చెప్పారు. ఎక్కువ మంది సాక్షులను యుపి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదని న్యాయమూర్తులు కూడా అడిగారు.

"44 మందిలో ఇప్పటివరకు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను మాత్రమే నమోదు చేసారు. మిగతా వారివి ఎందుకు చేయలేకపోయారు?" అని Chief Justice Ramana ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సాల్వే మాట్లాడుతూ.. "ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రధాన నిందితులందరూ అరెస్టు అయ్యారు" అని సమాధానమిచ్చారు.

ఎంతమందిని అరెస్టు చేశారని సుప్రీం కోర్టు అడగగా "రెండు నేరాలకు సంబంధించి అరెస్టులు జరిగాయి - ఒకటి రైతులను చంపినందుకు, మరొకటి హత్య చేయడానికి ఉపయోగించిన కారుతో సంబంధం ఉన్నవారిని.. మొదటి కేసులో 10 మందిని అరెస్టు చేశారు. " అని చెప్పుకొచ్చారు. 

సాక్షులను రక్షించాలని,  వారిలో ఎక్కువ మందిని ప్రశ్నించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. "పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారే తప్ప, ఈ అంశంపై మాకు మరింత అవగాహన ఉండదు. ఇది అంతులేని కథ కాకూడదు" అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

Lakhmipur Kheri: హత్య చేసి ఆందోళనకారుల నోరు మూయలేరు.. మరో వీడియో ట్వీట్ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ

Justice Hima Kohli మాట్లాడుతూ... " మిమ్మల్ని అడుగులు లాగుతున్నారని మేము భావిస్తున్నాము. దయచేసి దాన్ని తొలగించండి." అని కోరారు. ప్రధాన న్యాయమూర్తి రమణ, జస్టిస్ సూర్య కాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 8 న యుపి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

యుపి ప్రభుత్వం తరపున సాల్వే దీన్ని ఒప్పుకున్నాడు, "తగినంతగా చేయలేదు". విచారణ రోజున, ఆశిష్ మిశ్రా పోలీసు సమన్‌ను దాటవేశారు. "అవును, అధికారులు అవసరమైనవి చేసి ఉండాలి ..." అని మిస్టర్ సాల్వే కోర్టుకు చెప్పారు.

"up governament ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో మేము సంతృప్తి చెందలేదు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం పోలీసులను మేము ఆశిస్తున్నాము. తుపాకీ గాయాలతో సహా ఆరోపణలు చాలా తీవ్రమైనవి" అని చీఫ్ జస్టిస్ అన్నారు.

యుపి ప్రభుత్వాన్ని, పోలీసులను సుప్రీం కోర్టు నిలదీసిన తరువాత ఆశిష్ మిశ్రాను ఎట్టకేలకు విచారణకు పిలిచారు అందరిని అరెస్టు చేశారు. దీంట్లో ఏ నేరానికి సంబంధించిన స్టేటస్ నివేదికను అడిగారు.

Lakhimpur Kheri: నేడు సుప్రీం విచారణ.. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు కమిటీ వేసిన యూపీ ప్రభుత్వం

అయితే ఈ కేసులో ఆశిష్ మిశ్రా అతని తండ్రి తమ మీద ఆరోపించిన అన్ని ఆరోపణలను ఖండించారు. మిశ్రా మాట్లాడుతూ.. కారు తన కుటుంబానికి చెందినదనేనని, అయితే ఈ సంఘటన జరిగినప్పుడు తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేమని చెప్పుకొచ్చాడు. 

click me!