మట్టి వస్తువులకు పెరిగిన డిమాండ్.. 27.7% పెరిగిన అమ్మకాలు, ఆదాయం రెట్టింపు

Published : Nov 03, 2025, 11:19 PM IST
Uttar Pradesh

సారాంశం

ఉత్తరప్రదేశ్ మట్టికళా బోర్డు ప్రదర్శనల్లో 2025-26లో రూ.4.20 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది కంటే 27.7% ఎక్కువ. యోగి ప్రభుత్వ చొరవతో కళాకారుల ఆదాయం పెరిగింది.

Lucknow : ఉత్తరప్రదేశ్ మట్టికళా బోర్డు 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన మట్టికళా ప్రదర్శనలు రాష్ట్రంలోని కళాకారులు, హస్తకళా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కొత్త ఊపునిచ్చాయి. ఈ సమయంలో 10 రోజుల మట్టికళా మహోత్సవం, 7 రోజుల ప్రాంతీయ ప్రదర్శనలు, 3 రోజుల చిన్న మట్టికళా ప్రదర్శనలు జరిగాయి. మొత్తం 691 దుకాణాల్లో రూ.4,20,46,322 అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది 2024-25లో జరిగిన రూ.3,29,28,410 అమ్మకాల కంటే రూ.91,17,912 ఎక్కువ. ఇది దాదాపు 27.7% పెరుగుదలను చూపిస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంప్రదాయ కళలు, కళాకారుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వారి ఉత్పత్తులకు దేశవిదేశాల్లో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం.

70 జిల్లాల్లో మట్టికళా ప్రదర్శనలు, కొనుగోలుదారుల ఆసక్తి

లక్నోలోని ఖాదీ భవన్‌లో అక్టోబర్ 10 నుంచి 19, 2025 వరకు జరిగిన 10 రోజుల మట్టికళా మహోత్సవంలో 56 దుకాణాలు రూ.1,22,41,700 అమ్మకాలు చేశాయి. ఆగ్రా, కాన్పూర్. మురాదాబాద్ లలో అక్టోబర్ 13 నుంచి 19 వరకు జరిగిన ప్రాంతీయ ప్రదర్శనల్లో 126 దుకాణాల నుంచి రూ.78,84,410 అమ్మకాలు జరిగాయి. అదేవిధంగా రాష్ట్రంలోని 70 జిల్లాల్లో అక్టోబర్ 17 నుంచి 19 వరకు జరిగిన చిన్న మట్టికళా ప్రదర్శనల్లో 509 దుకాణాల ద్వారా రూ.2,19,20,212 అమ్మకాలు నమోదయ్యాయి. ఇది మట్టికళా ఉత్పత్తుల పట్ల వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని చూపిస్తుంది.

నాణ్యతే విజయ రహస్యం

గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 878 దుకాణాల ద్వారా రూ.3,29,28,410 అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది దుకాణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉత్పత్తుల నాణ్యత, మెరుగైన ప్రదర్శన వ్యవస్థ, మార్కెటింగ్ సహకారం సానుకూల ప్రభావం చూపాయని ఇది నిరూపిస్తుంది. శిక్షణ, డిజైన్ అభివృద్ధి, బ్రాండింగ్, ఆధునిక మార్కెటింగ్ పద్ధతుల ద్వారా కళాకారులకు దీర్ఘకాలిక ఆర్థిక సాధికారత కల్పించడమే మట్టికళా బోర్డు లక్ష్యం. రాబోయే సంవత్సరాల్లో వినియోగదారుల ఆధారిత కార్యక్రమాలతో కళాకారుల ఆదాయం, నైపుణ్యాలను మరింత పెంచుతారు.

యోగి ప్రభుత్వ చొరవతో సంప్రదాయ కళలకు ప్రోత్సాహం

యోగి ప్రభుత్వం సంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారి సామాజకి సంరక్షణ, ఆర్థిక బలం, సాంకేతిక అభివృద్ధి కోసం ఉత్తరప్రదేశ్ మట్టికళా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ చర్యతో వేలాది కుటుంబాలకు ఆత్మనిర్బరత, కొత్త ఆధారం దొరికింది. ఇలా మట్టికళా కళాకారులకు ఊరటనిస్తూ గ్రామాల్లోని చెరువుల నుంచి ఉచితంగా మట్టి తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల ముడిసరుకు లభ్యత సులభమై, ఖర్చు తగ్గింది. సంప్రదాయ కళకు ఆధునిక మార్కెటింగ్, ఆవిష్కరణల ద్వారా ప్రపంచ గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !