Abnormal: అసాధారణంగా ఎత్తు పెరిగిన యువకుడు.. సర్జరీ చేసిన వైద్యులు.. పేరెంట్స్‌కీ ఓ సూచన ఇచ్చారుగా..!

By Mahesh K  |  First Published Nov 17, 2023, 4:52 PM IST

యూపీకి చెందిన ఓ యువకుడు అసాధారణంగా ఎత్తు పెరిగాడు. 7.2 అడుగుల ఎత్తు పెరిగాడు. రాష్ట్రంలో ఎత్తైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే.. ఆయన అసాధారణంగా పెరగడంపై ఆందోళనతో వైద్యులను ఆశ్రయించగా.. ఆయనకు సర్జరీ చేసి పిట్యూటరీ గ్రంథి నుంచి ఓ గడ్డను తొలగించారు.
 


న్యూఢిల్లీ: ఓ యువకుడు అసాధారణంగా ఎత్తు పెరిగాడు. యూపీలోని లఖింపూర్ ఖేరీకి చెందిన ఆ యువకుడు రాష్ట్రంలో అతి ఎత్తైన వ్యక్తిగా మారిపోయాడు. 7.2 అడుగుల ఎత్తు పెరిగాడు. దీంతో ఏదో తేడాగా ఉన్నదని వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. అతనిలో ఉన్న సమస్యను గుర్తించి సర్జరీ చేశారు. అంతేకాదు, ఈ సందర్భంగా తల్లిదండ్రులకూ వైద్యులు ముఖ్యమైన సూచన చేశారు.

రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరోసర్జరీ డిపార్ట్‌మెంట్ వైద్యులు .. అసాధారణ ఎత్తు పెరుగుతున్న 23 ఏళ్ల యువకుడిని పరీక్షించారు. ఆయనకు సర్జరీ చేసి పిట్యూటరీ గ్రంథి నుంచి ఓ వ్రణాన్ని తొలగించారు.

Latest Videos

ఆ గడ్డ పెరుగుతూ ఉండటంతో సర్జరీ చేయక తప్పలేదని న్యూరో సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్, డాక్టర్ దీపక్ సింగ్ తెలిపారు. సర్జరీ తర్వాత ఆ యువకుడు వేగంగా కోలుకున్నాడని, గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడని వివరించారు. ఈ సర్జరీని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద చేసినట్టు తెలిపారు. 

Also Read : Elections: ఓటు ఓ చోటా.. సీటు మరో చోటా.. తమ ఓటు తమకే వేసుకోలేకపోతున్న బడా నేతలు

ఇలాంటి ఘటనలు అరుదుగా ఏమీ చోటుచేసుకోవని, ప్రతి ఆరు నుంచి ఏడు నెలల్లో ఇలాంటి ఘటనలు ఉంటాయి. ‘ సాధారణంగా ఇలాంటి ట్యూమర్లు సుమారు 16 ఏళ్ల నుంచి 17 ఏళ్ల కాలంలో వస్తూ ఉంటాయి. వాటి ద్వారా అసాధారణంగా ఎత్తు పెరుగుతారు. ఒక వేళ లేటు వయసులో ఈ స్థితి వస్తే.. అప్పుడు ముఖ ఎముకలు, కండరాలు అసాధారణంగా పెరుగుతాయి’ అని డాక్టర్ సింగ్ వివరించారు.

Also Read : Chidambaram: తెలంగాణ బలిదానాలకు క్షమాపణలు చెప్పిన చిదంబరం.. హంతకుడే సంతాపం చెప్పినట్టుంది: హరీశ్ రావు

అదే విధంగా ఆయన తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచన చేశారు. ఒక వేళ తమ పిల్లల్లో అసాధారణ ఎత్తుకు పెరుగుతున్నారని గమనిస్తే ఉదాసీనంగా వ్యవహరించరాదని చెప్పారు. వైద్యుల సలహా తీసుకోవానలి అన్నారు.

click me!