కొడుకుతో విడాకులు.. తండ్రితో పెళ్లి.. ! భార్యా, సవతి తల్లా? తెలియక షాక్ లో యువకుడు... !!

Published : Jul 05, 2021, 11:50 AM IST
కొడుకుతో విడాకులు.. తండ్రితో పెళ్లి.. ! భార్యా, సవతి తల్లా? తెలియక షాక్ లో యువకుడు... !!

సారాంశం

ఐదేళ్ల క్రితం మైనర్లుగా ఉన్నప్పుడే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 6 నెలలకే భర్త తాగుబోతంటూ ఆమె వదిలేసింది. కలిసి ఉండడానికి అతడు ఎంత ప్రయత్నించినా ససేమిరా అంది. కొంతకాలానికి ఆ యువకుడి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

ఆయన కోసం వెతుకుతున్న క్రమంలో తనను వదిలేసిన మహిళను తండ్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయాడు. విడిపోయిన భార్య కాస్తా.. ఇప్పుడు తనకు సవతి తల్లి కావడంతో షాక్ అయ్యాడు. 

ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ఇల్లు వదిలివెళ్లిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని ఆ యువకుడు అధికారులను ఆశ్రయించగా.. వారి అన్వేషణలో అసలు కథ బయటపడింది. 

48 యేళ్ల తండ్రి కొన్నేళ్ల క్రితం కుమారుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీని మీద ఆ వ్యక్తి బిసౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆమె మాత్రం రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని, మొదటి భర్త దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 
 
PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్