యాక్సిడెంట్‌లో ‘మరణించి’.. మార్చురీలో బతికాడు.. ఉత్తరప్రదేశ్‌లో ‘మిరాకిల్’

By telugu team  |  First Published Nov 21, 2021, 8:21 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతం జరిగింది. యాక్సిడెంట్‌లో మరణించిన 45 ఏళ్ల ఎలక్ట్రిషియన్.. సుమారు ఏడు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచిన తర్వాత కూడా మరుసటి రోజు ఉదయం మార్చురీలో బతికి ఉన్నట్టు తేలింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్రిటికల్‌ కండీషన్‌లో ఆయనను ఓ ప్రైవేటు హాస్పిటల్‌ తీసుకెళ్లగా ఆయన అప్పటికే మరణించాడని చెప్పారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనూ ఆయను పరిశీలించి ఫ్రీజర్‌లో పెట్టారు. కానీ, మరుసటి రోజు ఉదయం ఆ బాడీలో కదలికలు కనిపించాయి. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నది.
 


లక్నో: 45ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా స్పీడ్‌గా వచ్చిన బైక్ ఢీకొట్టింది. Accidentలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. క్రిటికల్ కండీషన్‌లోనే ఆయనను ఓ ప్రైవేటు హాస్పిటల్‌(Hospital)కు తీసుకెళ్లారు. కానీ, వైద్యులు అప్పటికే ఆయన మరణించాడని(Dead) నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్ మరోసారి ఆయనను పరీక్షించారు. జీవించి ఉన్న సంకేతాలేవీ లేవు. దీంతో ఆయనను ఓ మార్చురీ(Morgue) రూమ్‌కు తరలించారు. అదే రోజు ఫ్రీజర్‌లో పెట్టారు. ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉన్నది. కుటుంబ సభ్యులు, పోలీసులు హాస్పిటల్‌ చేరుకున్నారు. పోస్టుమార్టం కంటే ముందు సంతకం కోసం పోలీసులు కుటుంబ సభ్యులను అడిగారు. కానీ, ఇంతలోనే ఫ్రీజర్‌లోని ఆ వ్యక్తి బాడీలో కదలికలను కుటుంబ సభ్యులు కనిపెట్టారు. వైద్యులు కూడా ఔను ఆయనలో జీవం ఉన్నదని చెప్పారు. ఈ ‘మిరాకిల్’ Uttar Pradeshలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో 45 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ శ్రీకేష్‌ను వేగంగా వెళ్తున్న ఓ బైక్ గురువారం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో నేలపై కూలిపోయాడు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పేషెంట్‌ను పరీక్షించారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్టు తేల్చారు. అనంతరం బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించాల్సిందిగా సూచించారు. గురువారం రాత్రే బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాడీని అతిశీతలమైన ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్ చేరుకున్నారు. బాడీని ధ్రువీకరించి పోస్టుమార్టం కోసం అనుమతి ఇచ్చే పత్రాలపై ఆ కుటుంబం సంతకం పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు బాడీలో కదలికలను గుర్తించారు. ఫ్రీజర్‌లో
సుమారు ఏడు గంటలు ఉంచిన తర్వాత కూడా బాడీలో కదలికలు కనిపించాయి. 

Latest Videos

undefined

Also Read: కోడి పుంజు గుడ్డు పెట్టింది.. ఇదెక్కడి విచిత్రం..!

ఆ వ్యక్తి కుటుంబ సభ్యురాలు ఒకరు ఉద్వేగంతో అరిచారు. ఆయన ఇంకా చనిపోలేదని కేక వేశారు. ఆయన మరణిస్తే ఈ కదలికలు ఎలా సాధ్యమంటూ అడిగింది. ఆయన ఏమో చెప్పాలనుకుంటున్నాడని అన్నది. అంతేకాదు, ఇంకా ఆయన శ్వాస తీసుకుంటున్నాడని వివరించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్క సారిగా ఖంగుతిన్నారు. వెంటనే వైద్యులు పరుగున వచ్చారు. ఆయన బతికే ఉన్నాడని వైద్యులు చెప్పారు.

మొరదాబాద్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ్ సింగ్ మాట్లాడుతూ, తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలోనూ ఎమర్జెన్సీ మెడికల్ అధికారి ఆ పేషెంట్‌ను పరీక్షించాడని, కానీ, ఆయనలో హార్ట్ బీట్ లేదని పేర్కొన్నారు. చాలా సార్లు ఆయనను పరీక్షించాడని వివరించారు. ఆ తర్వాతే ఆయన మరణించినట్టు ధ్రువీకరించాడని అన్నారు. కానీ, ఈ రోజు ఉదయం ఆ వ్యక్తి బతికి ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారని చెప్పారు. దీనికి సంబంధించి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయని వివరించారు. ఆ వ్యక్తిని కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Also Read: చిన్నప్పటి నుంచి కన్ను మూసిందే లేదు.. ఆ మహిళ వింత ప్రవర్తనతో వైద్యులకు షాక్

అయితే, ఇది అరుదుల్లోకెల్లా అరుదుగా జరిగే ఘటన అని, దీన్ని వైద్యలు నిర్లక్ష్యం అని చెప్పలేమని సింగ్ అన్నారు. మీరట్‌లోని హెల్త్ సెంటర్‌లో కుమార్‌కు ఇప్పుడు చికిత్స జరుగుతున్నది. ఇప్పుడు ఇంకా ఆయన కోమాలోనే ఉన్నారు. ఆయనకు స్పృహ రావాల్సి ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైందని వివరించారు. ఇది మిరాకిల్ అని, ఇలా జరగడం చాలా అరుదు అని హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజేంద్ర కుమార్ అన్నారు.

వైద్యులపై తాము కేసు పెడతామని, వారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, అంతేకాదు, ఫ్రీజర్‌లో పెట్టి ఆయనను దాదాపు చంపేశారని కుటుంబ సభ్యులు అన్నారు.

click me!