అందంగా లేదని భార్యను హతమార్చిన భర్త

Published : Jun 09, 2018, 02:32 PM IST
అందంగా లేదని భార్యను హతమార్చిన భర్త

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణం

కట్టుకున్న భార్య అందంగా లేదంటూ చిత్ర హింసలకు గురిచేసి చంపేశాడో శాడిస్టు భర్త. ఈ ఘటప ఉత్తర ప్రదేశ్ లోని జగ్తిర గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లై సంవత్సరం తర్వాత ఇలా భార్య అందవిహీనంగా ఉందంటూ హతమార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బాదాన్ గ్రామానికి చెందిన నిఘాత్ అనే మహిళకు తషావర్ ఖాన్ గత సంవత్సరం 2017 లో వివాహమైంది. అయితే ఇతడు పెళ్లైనప్పడి నుండి భార్యను అందంగా లేవంటూ వేధించడం మొదలుపెట్టాడు. అలాగే  అత్త హుమిమ్, మామ ముబాసిర్ లు కూడా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. ఇలా కుటుంబం మొత్తం కలిసి తీవ్రంగా వేధిస్తున్నప్పటికి బాధితురాలు బైటికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా భావించిన  భర్త, అతడి సోదరుడు సనాబేర్ లు కలిసి ఆమెను హత్య చేశారు.

ఈ ఘటనపై మృతురాలి తండ్రి నెహాలుద్దిన్ మాట్లాడుతూ.... తన కూతురు అందంగా లేదంటూ అల్లుడు వేధించేవాడని తెలిపాడు. ఆమెను అందంగా తయారుచేయడానికి వైద్యం చేయిస్తానని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అల్లుడే ఈ హత్య కు పాల్పడ్డాడని ఆయన తెలిపాడు.

నిన్న రాత్ని 2 గంటల సమయంతో తన కూతురు ఫోన్ చేసి భర్త కొడుతున్నాడని, తనను పుట్టింటికి తీసుకెళ్లాలని ఏడుస్తూ ప్రాధేయపడిందని తెలిపాడు. దీంతో తాను, భార్య అప్రోజ్ బేగం తో కలిసి కూతురు వద్దకు హుటాహుటిన బయలు దేరామని, మార్గ మద్యలో ఉండగా అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. అయితే అక్కడికెళ్లి తన కూతురి మృతదేహాన్ని చూసి అనుమానంతో పోలీసులను ఆశ్రయించినట్లు అతడు తెలిపాడు. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని తెలిపాడు. 

ఈ హత్యపై తమ అల్లుడు,అతడి అన్న, తల్లిదండ్రులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!