రూ.700కోట్లు లేదు కానీ.. ఈ 175టన్నులు తీసుకోండి..యూఏఈ

By ramya neerukondaFirst Published 25, Aug 2018, 12:35 PM IST
Highlights

యూఏఈ.. తొలుత రూ.700కోట్ల సాయం చేస్తామని ప్రకటించింది. తర్వాత.. అసలు తాము అన్ని కోట్ల సాయం ప్రకటించనేలేదంటూ కేరళకు షాక్ ఇచ్చింది.
 

భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు  సాధారణ ప్రజలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500కోట్ల తక్షణ సాయం ప్రకటించగా.. యూఏఈ.. తొలుత రూ.700కోట్ల సాయం చేస్తామని ప్రకటించింది. తర్వాత.. అసలు తాము అన్ని కోట్ల సాయం ప్రకటించనేలేదంటూ కేరళకు షాక్ ఇచ్చింది.

అయితే.. ఒక్కసారిగా యూఏఈ మాటమార్చడంతో.. కేరళ ప్రజలతో సహా.. అందరూ షాక్ తిన్నారు. ఏమనుకుందో ఏమో.. కానీ యూఏఈ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 175టన్నుల విలువచేసే దుప్పట్లు, ఫుడ్స్, కొన్ని నిత్యవసర వస్తువులను కేరళ వరద బాధితులకు అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక విమానంలో వీటిని కేరళకు పంపించింది. యూఏఈ పంపిన విమానం.. తిరువనంతపురం చేరుకుంది.

 

ప్రకృతి విళయతాండవం కారణంగా కేరళలో ఇప్పటికే 300మందికి పైగా మృత్యువాతపడ్డారు. వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. చాలా మంది నివాసాలను కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. 

Last Updated 9, Sep 2018, 11:44 AM IST