బ్యాంక్ సర్వర్ పై హ్యాకర్ల దాడి...రూ. 94 కోట్లు చోరీ

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 12:20 PM IST
Highlights

మహారాష్ట్రలోని పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాస్మోస్ బ్యాంక్ పై సైబర్ నేరగాళ్లు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని హ్యాకర్లు ఈ బ్యాంకు సంబంధించిన సర్వర్ ని హ్యాక్ చేసి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారంతో ఏకంగా రూ. 94 కోట్ల చోరీకి పాల్పడ్డారు.

ఈ వ్యవహారం గురించి సైబర్ మరియ ఆర్థిక వ్యవహారాల డిప్యూటి కమీషనర్ జ్యోతిప్రియ సింగ్ మాట్లాడుతూ...ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు హ్యాకర్లు ఈ చోరీకి  పాల్పడినట్లు తెలిపారు. మొదట బ్యాంక్ ఏటిఎం కార్డుల సమాచారాన్ని భద్రపరిచే సర్వర్ ని హ్యాక్ చేసి అందులోకి ప్రవేశించిన హ్యాకర్లు  వీసా మరియు రూపే కార్డుల సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం సాయంతో నకిలీ ఏటీఎంలను సృష్టించి విదేశాల్లోని ఏటీఎం కేంద్రాల్లో చోరీకి పాల్పడ్డారు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా దేశాలతో పాటు మొత్త 28 దేశాల్లో వివిధ ఏటీఎంల నుండి దాదాపు రూ. 78 కోట్లను తస్కరించారు.

ఇంతటితో ఆగకుండా ఇదే బ్యాంక్ కు చెందిన ఇంటర్నెట్ స్విప్ట్ సిస్టమ్ పై కూడా దాడిచేశారు. ఇలా మొత్తంగా ఈ బ్యాంకుకు చెందిన దాదాపై రూ. 94 కోట్లను రెండు రోజుల వ్యవధిలోనే మాయం చేశారు.

 ఈ వ్యవహరంపై ఆయా దేశాల అధికారులకు సమాచారం అందించామని జ్యోతిప్రియ తెలిపారు.  వారి స్పందన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హ్యాకర్లు ఈ బ్యాంకు వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓ పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడినట్లు ఆమె తెలిపారు.
 
click me!