Mohammad Shami : మహ్మద్ షమీ గ్రామంలో స్టేడియం నిర్మించనున్న యూపీ ప్రభుత్వం..

By Asianet News  |  First Published Nov 18, 2023, 4:51 PM IST

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టి భారత్ ను ఫైనల్ కు చేర్చిన మహ్మద్ షమీ గ్రామంలో యూపీ ప్రభుత్వం స్టేడియాన్ని నిర్మించనుంది. ఈ విషయంలో ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం ఆఫీసుకు చేరాయి.


Mohammad Shami : ఐసీసీ వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ మహ్మద్ షమీ రికార్డు సృష్టించారు. అయితే ఆయన స్వగ్రామంలో యూపీ ప్రభుత్వం స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలోని సహస్పూర్ అలీనగర్ కు షమీ స్వగ్రామం. ఆయన చూపిస్తున్న అద్భుత ప్రతిభకు గుర్తింపునకు సహస్పూర్ అలీననర్ లో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 

Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డికి ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..

Latest Videos

ప్రస్తుత టోర్నమెంట్ లో షమీ అద్భుత ప్రదర్శన చేయడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది. గత బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టి భారత్ ను ఫైనల్ కు చేర్చిన సంగతి తెలిసిందే.

అమ్రోహా జిల్లా అధికారులు మహ్మద్ షమీ గ్రామంలో ఇప్పటికే 1 హెక్టార్ (2.47 ఎకరాలు) స్థలాన్ని గుర్తించారు. ఈ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 20 స్టేడియాలు నిర్మించాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే షమీ గ్రామంలో స్టేడియం నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.

Chandrayaan-4:చంద్రుడిపై మరో ప్రయోగం.. చంద్రయాన్-4కు సిద్ధమవుతున్న ఇస్రో 

ఈ స్టేడియంలో ఓపెన్ జిమ్, రేస్ ట్రాక్, ఇతర సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న స్టేడియం శంకుస్థాపనకు జిల్లా యంత్రాంగం షమీ తల్లిదండ్రులను ఆహ్వానించే అవకాశం ఉంది. షమీ గ్రామం జిల్లా కలెక్టరేట్ నుండి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ మొరాదాబాద్ నుండి హాపూర్ ను కలిపే ఎన్ హెచ్ -9 కు సమీపంలోనే ఉంది.

tunnel collapse: ఉత్తరకాశీలో కుప్పకూలిన టన్నెల్.. సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన ఎయిర్ ఫోర్స్.. ఎందుకంటే ?

కాగా.. ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తున్న షమీ తన తండ్రి తౌసిఫ్ అలీ సంరక్షణలో సహస్పూర్ గ్రామంలోనే పెరిగారు. పేస్ బౌలింగ్ లో ప్రాథమిక శిక్షణను తండ్రి ఆయనకు నేర్పించారు. షమీలోని ప్రతిభను గుర్తించిన తౌసిఫ్ అలీ.. కుమారుడిని మొరాదాబాద్ క్లబ్ కు పంపారు. కానీ ఆయన యూపీ అండర్ -19 జట్టుకు ఎంపిక కాలేకపోయారు. ఇంతలో ఆయన ప్రతిభ ను గుర్తించిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి కోల్ కతాలోని టౌన్ క్లబ్ కు తీసుకెళ్లారు. షమీ 2010-11లో బెంగాల్ నుంచి రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

click me!