
Up election news 2022 : మరో రెండు రోజుల్లో యూపీ (up)లో మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ (bjp) మేనిఫెస్టో (menifesto) ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amith sha) విడుదల చేయనున్నారు. లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్రం (lokh kalyan sankalp patra) పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను రెండు రోజుల (ఆదివారం) కిందనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. లతా మంగేష్కర్ (latha mangeshkar) మృతికి సంతాపం తెలుపుతూ దానిని వాయిదా వేశారు.
ఈ విసయంపై యూపీ బీజేపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 8, 2022 న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీజేపీ 'లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర'ని విడుదల చేస్తారు’’ అని పేర్కొంది. ఈ మేనిఫెస్టోలో జాతీయవాదం, అభివృద్ధి, కాశీ, మధుర వంటి అధ్యాత్మిక నగరాల అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి పెట్టనుందని ఓ వార్త సంస్థ తెలిపింది.
2017లో యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ (sp) 47 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ (bsp) 19 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ (congress) కేవలం ఏడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి కూడా యూపీలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఏదేళ్లలో యూపీలో సాధించిన ప్రగతి, శాంతి భద్రతల అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రచారంలో బీజేపీ ముందుకు వెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షాను, ఇతర ముఖ్యమైన నాయకులతో యూపీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రధాని మోడీ (prime minister modi) కూడా ఉత్తర్ ప్రదేశ్ కు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం ఓ బహిరంగ సభ సభలో ఆయన పాల్గొని మాట్లాడాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో బిజ్నోర్‌లో వర్చువల్ ప్రసంగంతోనే సరిపెట్టారు. ఈ సమావేశంలో గత ప్రభుత్వాల తీరునే ప్రధాని టార్గెట్ చేసుకొని మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ (SP) - బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ప్రభుత్వాలను మాఫియా రాజ్‌కు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించామని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని నొక్కి చెప్పారు.
అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) పార్టీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నకిలీ సమాజ్ వాదీలు, వారి సన్నిహితుల వల్ల యూపీ అభివృద్ధి నదిలో నీరు నిలిచిపోయిందని దుయ్యబట్టారు. వారికి సామాన్యుల అభివృద్ధి దాహం, ప్రగతి దాహం, పేదరికం నుండి విముక్తి దాహంతో ఎప్పుడూ సంబంధం లేదని తెలిపారు. వారు తమ దాహాన్ని, తమ సన్నిహితుల దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే పని చేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా... ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.