Hijab Row: ఉడిపి ఎంజీఎం కాలేజీ వద్ద ఉద్రిక్తత, విద్యార్దుల పోటా పోటీ నిరసనలు

Published : Feb 08, 2022, 10:43 AM ISTUpdated : Feb 08, 2022, 10:49 AM IST
Hijab Row: ఉడిపి ఎంజీఎం కాలేజీ వద్ద ఉద్రిక్తత, విద్యార్దుల పోటా పోటీ నిరసనలు

సారాంశం

కర్ణాటకలోని ఉడిపి ఎంజీఎం కాలేజీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలను ధరించి మరో వర్గం విద్యార్ధులు కాలేజీకి వచ్చారు. అయితే వారిని కాలేజీలోకి అనుమతించకపోవడంతో ఆ విద్యార్ధులు నిరసనకు దిగారు.

బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ఎంజీఎం కాలేజీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. Hijab విషయమై వివాదం నెలకొంది. హిజాబ్ కు పోటీగా మరో వర్గం విద్యార్ధులు కాషాయ కండువాలు ధరించి Collegeకి వచ్చారు. అయితే కాషాయ కండువాలు ధరించి వచ్చిన వారిని కాలేజీ లోపలికి అనుమతించలేదు. దీంతో కాషాయ కండువాలతో విద్యార్ధులు కాలేజీ గేటు ముందు నిలబడి నిరసనకు దిగారు. కాలేజీ వద్ద హిజాబ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా విద్యార్ధులు విడిపోయి నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు పోలీసులు, కాలేజీ అధ్యాపకులు ప్రయత్నిస్తున్నారు.

ఉడిపి జిల్లాలోని కుందాపూర్ ప్రభుత్వ కళాశాలలో బాలికలు హిజాబ్ ధరించి క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. అయితే వారికి పాఠాలు చెప్పకుండా ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. 

క‌ళాశాల‌ గేట్ల వెలుపల రద్దీని నివారించేందుకు ఇలా చేశామని college సిబ్బంది తెలిపారు. విద్యాసంస్థల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు Uniform తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు హిజాబ్‌ను తొలగించిన తర్వాతే విద్యార్థులు తరగతులకు హాజ‌రు కావాల‌ని ప్రిన్సిపాల్ రామకృష్ణ పునరుద్ఘాటించారు. మ‌రోవైపు.. త‌ర‌గతుల్లో  హిజాబ్ తొలగించబోమని విద్యార్థులు గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నారు. 

అలాగే కుందాపూర్‌లోని కలవర వరదరాజ్ ఎం శెట్టి ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థులను ఇంటికి పంపించారు. . ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు హిజాబ్ లేకుండా తరగతులకు వెళ్లమని సూచించామని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు.  కానీ వారు నిరాకరించారు.దీంతో వారిని కళాశాల‌లోకి అనుమ‌తించ‌లేదని వైస్ ప్రిన్సిపాల్ ఉషాదేవి చెప్పారు.  

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో హిజాబ్ వివాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. ఈ ప్రాంతంలోని శాంతేశ్వర పియు,  జిఆర్‌బి కళాశాలలో హిజాబ్ ధరించిన తోటి విద్యార్థులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వ‌హించారు. వారికి వ్య‌తిరేకంగా  కొంత‌ మంది విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క‌ళాశాల క్యాంప‌స్ లోకి ప్రవేశించారు.

గ‌త‌నెల‌లో ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలలో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి హిజాబ్‌లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌నీ తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో  తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో  నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్కమంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో  ఫిబ్రవరి 8  ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించనుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Republic Day 2026 Delhi: గణతంత్ర వేడుకల్లో విన్యాసాల తోఅదరగొట్టిన భారత వాయుసేన | Asianet News Telugu
77th Republic Day: PM Modi Pays Tribute to Martyrs at Rashtriya Samar Smarak | Asianet News Telugu