Punjab Elections 2022 : నేను టెర్రరిస్ట్ ను కాదు - పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ

Published : Feb 14, 2022, 10:55 PM ISTUpdated : Feb 14, 2022, 11:03 PM IST
Punjab Elections 2022 : నేను టెర్రరిస్ట్ ను కాదు - పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ

సారాంశం

పంజాబ్ లో హోషియాపూర్ రాహుల్ గాంధీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీకి సీఎం చరణ్ జిత్ సింగ్ హాజరవ్వాల్సి ఉంది. అయితే అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ లో పర్యటిస్తుండటంతో చన్నీ ఫ్లైట్ టేకాఫ్ కు అనుమతి రాలేదు. దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Punjab Elections 2022 : పంజాబ్ (punjab)లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ  (prime minister narendra modi) ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ (charanjith singh channi) హోషియార్‌పూర్ ప్రయాణం ర‌ద్దు అయ్యింది. దీంతో ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యారు. తాను టెర్ర‌రిస్ట్ (Terrorist) కానని, పంజాబ్ కు ముఖ్య‌మంత్రిన‌ని అన్నారు. ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని అన్నారు.

పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హోషియార్‌పూర్ (Hoshiarpur) రాహుల్ గాంధీ (rahul gandhi) ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి సీఎం చ‌ర‌ణ్ జిత్ చ‌న్నీ హాజ‌రు అవ్వాల్సి ఉంది. అయితే ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ జ‌లందర్ లో ప‌ర్య‌టిస్తుండ‌టంతో ఆ ప్రాంతాన్ని నో -ప్లై జోన్ గా ప్ర‌క‌టించారు. దీంతో చ‌ర‌ణ్ జిత్ సింగ్ ప్ర‌యాణించాల్సిన విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమ‌తి లేకుండా పోయింది. దీంతో ఆయ‌న ఎన్నిక‌ల ర్యాలీకి హాజ‌రుకాలేక‌పోయారు. ఈ విష‌యంపై చ‌ర‌ణ్ జిత్ సింగ్ తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. 

అకార‌ణంగా త‌న విమ‌నానికి అనుమ‌తి నిరాక‌రించార‌ని, దీంతో తాను రాహుల్‌ గాంధీ ర్యాలీకి వెళ్ల‌లేక‌పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘‘ చరణ్‌జిత్ చన్నీ ఒక ముఖ్యమంత్రి. ఆయ‌న హోషియార్‌పూర్‌కు వెళ్లకుండా మీరు అడ్డుకునేందుకు ఆయ‌న ఉగ్ర‌వాది కారు. ఇది మార్గం కాదు ’’ అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘ నేను ఉదయం 11 గంటలకు ఉనాలో ఉన్నాను, కానీ అకస్మాత్తుగా (హోషియార్‌పూర్‌కు) విమానానికి అనుమతిని నిరాక‌రించారు. ప్రధాని మోడీ ప్ర‌చారం కారణంగా దీనిని నో-ఫ్లై జోన్‌గా (no-fly zone)ప్రకటించారు. హోషియార్‌పూర్‌లో రాహుల్ గాంధీ ర్యాలీకి నేను హాజరు కాలేకపోయాను. నాకు ప్ర‌యాణం చేయ‌డానికి అనుమతి ఉంది ’’ అని చ‌న్నీ ఓ మీడియా సంస్థ‌తో చెప్పారు. 

పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీకి హోషియార్‌పూర్‌కు వెళ్ల‌డానికి అనుమ‌తి నిరాక‌రించిన‌ప్ప‌టికీ.. రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను పట్టణంలో ల్యాండ్ చేయడానికి అనుమతించారు. దీంతో ఆయ‌న ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్నారు. “ ముఖ్యమంత్రి ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హోషియార్‌పూర్‌కు రావడానికి అనుమతిని ఇవ్వ‌లేదు. ఇది సిగ్గుచేటు. ఎన్నికల సంఘం ఈ విష‌యంలో స్పందించ‌క‌పోతే ఈ ఎన్నికలు ఒక ప్రహసనమని, బూటకమని నేను అర్థం చేసుకుంటాను’’ అని కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ (sunil Jakhar) అన్నారు.

గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ భద్రతా ఉల్లంఘన జరిగింది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తరువాత పంజాబ్‌లో జలందర్ (jalandhar)లో ఎన్నికల ర్యాలీలో ప్రసగించిన ప్రధాని మోడీ.. రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎదురైన అనుభ‌వాన్ని పంచుకున్నారు. ‘‘ ఆ స‌మ‌యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నా పేరు ప్రకటించారు. నేను ప్రచారానికి పఠాన్‌కోట్ త‌రువాత హిమాచల్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే స‌మ‌యంలో వారి యువరాజ్ (యువరాజు) కూడా అమృత్‌సర్‌లో ఉన్నారు. దీంతో నా హెలికాప్టర్ ఎగరడానికి అనుమతించ‌లేదు. కాబట్టి ప్రతిపక్షాలను ప‌నిచేసుకోనివ్వ‌కపోవ‌డం కాంగ్రెస్‌కు అలవాటు.’’ అని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu