UP Elections 2022 : 2017 యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో 92 శాతం నెర‌వేర్చాం - అమిత్ షా

Published : Feb 08, 2022, 02:10 PM IST
UP Elections 2022 : 2017 యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో 92 శాతం నెర‌వేర్చాం - అమిత్ షా

సారాంశం

యూపీలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 92 శాతం నెరవేర్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తాము చెప్పింది తప్పకుండా చేస్తామని అన్నారు. 2022 ఎన్నికల కోసం ఆయన బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.   

UP Election News 2022 :  యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా (amith sha) బీజేపీ (bjp) మేనిఫెస్టో (menifesto)ను మంగ‌ళ‌వారం ల‌క్నో (lacknow)లో విడుద‌ల చేశారు. లోక్ క‌ళ్యాణ్ సంక‌ల్ప్ ప‌త్ర (lokh kalyan sankalp patra) పేరుతో దీనిని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడారు. 2017లో ఎన్నిక‌ల స‌మ‌యంలో 112 వాగ్దానాలు ఇచ్చామ‌ని, వాటిలో ఇప్ప‌టి వర‌కు 92 శాతం నెర‌వేర్చామ‌ని చెప్పారు. డ‌బుల్ ఇంజిన్ ప్రభుత్వం 2030 నాటికి ఉత్తరప్రదేశ్‌ (uthara pradhesh)ను నెంబ‌ర్ వ‌న్ గా మార్చడానికి కృషి చేస్తోంద‌ని చెప్పారు. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adhityanath), కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan), కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (anuragh takur), యూపీ డీసీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad mourya), బీజేపీ రాష్ట్ర చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ (dev singh) సమక్షంలో హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన ‘జనసభ’లో అమిత్ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సంకల్ప పత్రకు బీజేపీ యూపీ టీమ్ రూపం ఇచ్చింది. ఇది యూపీ ప్రభుత్వ తీర్మానం.. 2017 ఇచ్చిన సంకల్ప్ పత్రలో 212 తీర్మానాలు ఉండగా, వాటిలో 92 శాతం అమ‌ల‌య్యాయి.  మేం ఏం చెబితే అది చేస్తాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2017లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం తనకు ఇంకా గుర్తే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. యూపీ అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు కోసం పాటు ప‌డిన యోగి ప్ర‌భుత్వానికి ఐదేళ్లు పూర్త‌య్యింద‌ని అన్నారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

ప్రధానమైన హామీలు ఇవే..
సొంతంగా భూమి లేని రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKISAN) పథకం మొత్తాన్ని రెట్టింపు చేయడం మేనిఫెస్టోలోని మొదటి వాగ్దానం. ప్రస్తుతం, PM-కిసాన్ నిధి కింద సంవత్సరానికి రూ. 6,000 ఇస్తున్నారు. ఇది మూడు విడ‌త‌ల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల‌కు అందిస్తున్నారు. దీంతో పాటు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామ‌ని పేర్కొంది. 

విద్యార్థినులకు, శ్రామిక మహిళలకు స్కూటీ (scooty)ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (upsc), స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (spsc)నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మవుతున్న విద్యార్థిణుల‌కు ఉచితంగా కోచింగ్ ఇస్తామ‌ని పేర్కొంది. 

కోవిడ్ -19 (covid -19) మహమ్మారి కారణంగా నిర్వ‌హిస్తున్న ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు ల్యాప్‌టాప్ (laptop) ఉచితంగా అందిస్తామ‌ని తెలిపింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పిస్తామని, ప్రతి ఇంటికి కనీసం ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.

ఉజ్వల యోజన కింద హోలీ (holi), దీపావళి (diwali) పండుగలలో వినియోగదారులకు ప్రతీ సంవత్సరం రెండు ఉచిత సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి అయ్యే ఖ‌ర్చు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని చెప్పింది.

వీటితో పాటు కాకుండా గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన కృష్ణ జన్మభూమి ఆలయ పునరుద్ధరణకు కూడా పార్టీ హామీ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని తెలిపింది. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద ప్ర‌స్తుతం ఇస్తున్న ఉన్న రూ.15,000ను రూ.25,000కి పెంచుతామ‌ని హామీ ఇచ్చింది. 

60 ఏళ్లు పైబడిన మహిళలు ప్రజా రవాణాలో ఉచితంగా ప్రయాణం క‌ల్పిస్తామ‌ని చెప్పింది. రాష్ట్రంలోని మహిళల కోసం గులాబీ రంగు మరుగుదొడ్లను ప్రారంభిస్తామని పేర్కొంది. వృద్ధులకు నెలకు రూ.1500 పింఛను అందిస్తామ‌ని చెప్పింది. 

విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు (smart phones), ట్యాబ్లెట్లు (tablets) అందజేస్తామని మేనిఫెస్టో పేర్కొంది. అంతేకాకుండా మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను కూడా ప్రారంభింస్తామ‌ని తెలిపింది. ఈ మిషన్ కింద క్రీడాకారులకు ఉచితంగా స్పోర్ట్స్ కిట్‌లను అందిస్తామ‌ని తెలిపింది. 

రాష్ట్రంలో ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ కోసం 6,000 మంది డాక్ట‌ర్లు, 10,000 మంది పారామెడిక్ నిపుణులను నియమిస్తామ‌ని తెలిపింది. మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు రెట్టింపు చేస్తామ‌ని పేర్కొంది. లవ్ జిహాద్ (love jihad)నిందితులకు పదేళ్ల శిక్ష, లక్ష జరిమానా విధించేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్పింది. సాంస్కృతిక కళల్లో శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో లతా మంగేష్కర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామ‌ని బీజేపీ తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu