హడావుడిగా రాష్ట్ర విభజన,అయినా నమ్మలేదు:ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు

Published : Feb 08, 2022, 02:00 PM ISTUpdated : Feb 08, 2022, 02:21 PM IST
హడావుడిగా రాష్ట్ర విభజన,అయినా నమ్మలేదు:ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ రాష్ట్ర విభజనపై రాజ్యసభ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించినా కూడా కాంగ్రెస్ కు ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కలేదన్నారు.


న్యూఢిల్లీ:Telangana ను ఇచ్చినా కూడా ఆ రాష్ట్ర ప్రజలు Congress ను నమ్మలేదని Narendra Modi వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు. 

Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే  ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు. 

Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. 

మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో  ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు. 

రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోడీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని ఆయన ప్పష్టం చేశారు. అయితే విభజన జరిగిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేదన్నారు. హడావుడిగా చర్చ లేకుండా పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయించారని మోడీ చెప్పారు. అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు.

వరుసగా రెండు రోజూ కూడా కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. నిన్న లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇవాళ రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ నుండి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును మోడీ  తప్పుబట్టారు. ఆయా సమయాల్లో కాంగ్రెస్ సరైన నిర్ణయాలు తీసుకొంటే సమస్యలు వచ్చేవి కావన్నారు.

రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోడీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని ఆయన ప్పష్టం చేశారు. అయితే విభజన జరిగిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేదన్నారు. హడావుడిగా చర్చ లేకుండా పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయించారని మోడీ చెప్పారు. అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?