
జార్ఖండ్ : ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం చాలా దేశాల్లో సాధారణ విషయంగా మారిపోయింది. స్వలింగ వివాహాలను చాలా దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే భారత్ లో మాత్రం ఇలాంటి gay marriagesను సమాజం, తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో అంగీకరించడం లేదు. అలాంటి పెళ్లిళ్లు ఆసియా దేశాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. తాజాగా jharkhandకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకుని.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్ లోని dhanbadలో సంచలనం రేకెత్తించింది.
ధన్ బాద్ లో ఉంటున్న రాఖీ మిర్ధా (24), కరిష్మా రావత్ (23) అనే యువతులు చిన్నప్పటినుంచి స్నేహితులు. వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని భయంతో ఇళ్ల నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని, జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నామని, తమకు రక్షణ కల్పించాలని అడిగారు. ఇలా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడాన్ని మొదట పోలీసులు కూడా జీర్ణించుకోలేకపోయారు.
తర్వాత విషయం అర్థం చేసుకుని.. ఇద్దరమ్మాయిల కుటుంబసభ్యులను స్టేషన్ కు పిలిపించారు. వీరిద్దరి పెళ్లి గురించి తెలిసి వారి కుటుంబ సభ్యులు కూడా మొదట ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇద్దరికీ ఎంతగానో నచ్చచెప్పారు. అయినా వారు వినలేదు. కొన్ని గంటల పాటు అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయిలిద్దరిని వారి తల్లిదండ్రులతో పాటు ఇళ్లకు పంపించేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో నిరుడు డిసెంబర్ 20న తొలి గే మ్యారేజ్ నమోదయ్యింది. తెలంగాణలో తొలి ‘gay’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తన కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగసంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికి ఇలా చేశామని చెప్పారు.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై.. : ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ (34) హైదరాబాదులో ఆతిథ్య రంగంలో పని చేస్తున్నాడు. కోల్ కతాకు చెందిన చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ-కామర్స్ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ ద్వారా కలిశారు. రోజంతా కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. అంతిమంగా ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నారు.
అయితే తమ ప్రేమ, పెళ్లి, సహజీవనం... పేరేదైనా కానీ సమజం నుంచి తమకు ఆమోదం లభించదన్న భయంలో పడ్డారు. అందుతే తమ ప్రేమను బహిర్గతం చేయలేకపోయారు. అందుకే తాము ఉద్యోగాలు చేస్తున్న Hyderabad లోనే.. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా living together చేస్తున్నారు. కానీ ఇటీవలే వారికి ఇది ఇలా కాదు అనిపించింది. దీంతో వీళ్లిద్దరూ కలిసి గత ఫిబ్రవరి 14న తమ ఈ ప్రేమ వ్యవహారం ఓ ఆంగ్ల పత్రికకు interview ఇచ్చారు. అందులో ప్రచురితమైన అనంతర పరిణామాలతో ‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’ అని పేరెంట్స్ కి తేల్చి చెప్పేశారు. మొదట ఈ విషయం విన్న ఇరువైపుల పెద్దలు షాకయ్యారు. ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు. దీంతో వీరి పెళ్లికి అడ్డు లేకుండా పోయింది. పెళ్లి బాజాలు మోగాయి.