
UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (uttarpradesh) అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath), కాంగ్రెస్ (congress)కు చెందిన అజయ్ కుమార్ లల్లూ (ajay kumar lallu), సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)కి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య (swami prasad mourya) వంటి రాజకీయ ప్రముఖుల తమ భవితవ్యాన్ని పరిక్షీంచుకోకున్నారు. 10 జిల్లాల పరిధిలోని 57 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆరో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (bjp) ఆధిపత్యం చెలాయిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2017లో బీజేపీ 46 సీట్లు గెలుచుకోగా, అప్నాదళ్ ఒక సీటు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (SP) కేవలం రెండు స్థానాల్లో గెలుపొందగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 5 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) వరుసగా 1 సీటు గెలుచుకున్నాయి. ఆరో విడత ఎన్నికల కోసం ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నేటి ఉదయం (మార్చి 3) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగనున్నాయి.
ఆరో దశ పోలింగ్ 10 జిల్లాల్లో విస్తరించి ఉన్న 57 స్థానాల్లో జరుగుతున్నాయి. అంబేద్కర్‌నగర్, బల్లియా, బల్రాంపూర్, బస్తీ, డియోరియా, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, మహరాజ్‌గంజ్, సంత్ కబీర్ నగర్, సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దశలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. కతేహరి, తాండా, అలాపూర్ (ఎస్సీ), జలాల్‌పూర్, అక్బర్‌పూర్, తులసిపూర్, గైన్సారి, ఉత్రౌలా, బల్రాంపూర్ (ఎస్సీ), షోహ్రత్‌గఢ్, కపిల్వాస్తు (ఎస్సీ), బన్సీ, ఇత్వా, దోమరియాగంజ్, హర్రయ్యా, కప్తంగంజ్, రుధౌలీ, బస్తీ సదర్, మహదేవ (SC), మెన్హదావల్, ఖలీలాబాద్, ధన్‌ఘట (SC), ఫారెండా, నౌతన్వా, సిస్వా, మహారాజ్‌గంజ్ (SC), పానియరా, కైంపియర్‌గంజ్, పిప్రైచ్, గోరఖ్‌పూర్ అర్బన్, గోరఖ్‌పూర్ రూరల్, సహజన్వా, ఖాజానీ (SC), -చౌరా, బన్స్‌గావ్ (SC), చిల్లుపర్, ఖద్దా, పద్రౌనా, తమ్‌కుహి రాజ్, ఫాజిల్‌నగర్, కుషీనగర్, హటా, రాంకోలా (SC), రుద్రపూర్, పథర్‌దేవా, రాంపూర్ కార్ఖానా, భట్‌పర్ రాణి, సేలంపూర్ (SC), బర్హాజ్, బెల్తారా రోడ్, రాస్రా, సికందర్‌పూర్, ఫెఫ్నా, బల్లియా నగర్, బన్స్‌డిహ్, బైరియా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
కీలక అభ్యర్థులు వీరే..
ఈ సారి మొదటి సారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఈసారి మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిత్యనాథ్‌పై బీజేపీ మాజీ నేత, దివంగత ఉపేంద్ర దత్ శుక్లా (upendra dath sukla) భార్యను ఎస్పీ రంగంలోకి దింపింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ తమ్‌కుహి రాజ్ స్థానం నుంచి, తన మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఎస్పీ సీనియర్ నాయకుడు రామ్ గోవింద్ చౌదరి (ram govindh choudhary) బన్సిద్హ్ నుంచి పోటీ చేస్తున్నారు.
పథర్‌దేవా నుంచి నుంచి వ్యవసాయ మంత్రి సూర్య ప్రతాప్ షాహి, ఇట్వా నుంచి విద్యా మంత్రి సతీష్ చంద్ర ద్వివేది, బంసి నుంచి ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ పోటీ చేస్తుండగా.. రాష్ట్ర మంత్రులు శ్రీ రామ్ చౌహాన్ ఖజానీ నుంచి, జై ప్రకాష్ నిషాద్ రుద్రపూర్ నుంచి ఈ సారి బరిలో ఉన్నారు.