Ukraine Russia Crisis: ఖార్కివ్ లో బందీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా ఆరోపణ

Published : Mar 03, 2022, 07:50 AM ISTUpdated : Mar 03, 2022, 07:53 AM IST
Ukraine Russia Crisis: ఖార్కివ్ లో బందీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా ఆరోపణ

సారాంశం

ఉక్రెయిన్ రక్షణ దళాలు భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నాయని.. వారిని యుద్ధంలో షీల్డ్ గా వాడనున్నాయని రష్యా ఆరోపణలు గుప్పించింది. ఉక్రెయిన్ కూడా రష్యా బలగాలు భారతీయ విద్యార్థులను బందీలుగా మార్చాయని ఆరోపిస్తోంది.

ఉక్రెయిన్ : యుద్ధతీవ్రత నెలకొన్న Ukraineలో చిక్కుకుపోయిన తన పౌరులను తరలించడానికి భారతదేశం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే, Russia, ఉక్రెయిన్ రెండు దేశాల్లోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి చేర్చేలా సాయం చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు తరలింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ లు ఎదుటి దేశాలు Indian studentsను hostagesగా ఉంచుకున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఉక్రెయిన్ భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. ఖార్కివ్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక బ్రీఫింగ్‌లో తెలిపింది.

మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ఒక ప్రకటనలో "మా డేటా ప్రకారం, ఖార్కివ్‌లో, ఉక్రేనియన్ అధికారులు ఉక్రేనియన్ నుంచి బెల్గోరోడ్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులను పెద్ద సంఖ్యలో బలవంతంగా నిర్బంధిస్తున్నారు" అన్నారు.

 "భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి.  భారతదేశం ప్రతిపాదించినట్లుగా, వారి సైనిక రవాణా విమానాలు లేదా భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుండి వారిని ఇంటికి పంపిస్తాం "

భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చింది : ఉక్రెయిన్

ఇదిలా ఉంటే, మరోవైపు ఉక్రెయిన్ MFA భారత్, పాకిస్తాన్, చైనా, ఇతర దేశాల విద్యార్థులను "రష్యన్ సాయుధ దురాక్రమణ దారులు బందీలుగా మార్చారు" అని ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఉద్రిక్త ప్రాంతాల నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంపై వారు చర్చించినట్లు సమాచారం.

ఇదిలావుండగా, 6000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. "యుద్ధవాతావరణం నెలకొన్న  ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20,000 మంది భారతీయులలో, 6,000 మందిని ఇప్పటివరకు స్వదేశానికి తరలించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది" అని చెప్పుకొచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu