గదిలో పిల్లలు.. ఇంట్లోనే మహిళా డాక్టర్ దారుణ హత్య

Published : Nov 21, 2020, 12:50 PM IST
గదిలో పిల్లలు.. ఇంట్లోనే మహిళా డాక్టర్ దారుణ హత్య

సారాంశం

మరో గదిలో ఉన్న ఆమె ఇద్దరు పిల్లలపై కూడా నిందితుడు దాడి చేయాలని ప్రయత్నించాడు. అయితే.. వారు అతని దాడి నుంచి సులభంగా తప్పించుకున్నారు. తీవ్రగాయాలపాలైన నిషా సింఘాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో  చేర్పించగా.. అక్కడ ప్రాణాలు వదిలేసింది.

ఓ మహిళా డాక్టర్ తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె పిల్లలు ఇంట్లోనే మరో గదిలో ఉండటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్రాకు చెందిన నిషా సింఘాల్.. డెంటిస్ట్ పని చేస్తున్నారు. ఆమె భర్త  అజయ్ సింఘాల్ కూడా డాక్టరే. ఆయన సర్జిన్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. శుక్రవారం నిషా సింఘాలపై దాడి జరిగింది. వారి ఇంటికి సమీపంలో ఉండే ఓ కేబుల్ ఆపరేటర్ ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఆమెపై దాడి చేసినట్ల తెలుస్తోంది.

మరో గదిలో ఉన్న ఆమె ఇద్దరు పిల్లలపై కూడా నిందితుడు దాడి చేయాలని ప్రయత్నించాడు. అయితే.. వారు అతని దాడి నుంచి సులభంగా తప్పించుకున్నారు. తీవ్రగాయాలపాలైన నిషా సింఘాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో  చేర్పించగా.. అక్కడ ప్రాణాలు వదిలేసింది.

కాగా.. నిషా పై దాడి జరిగే సమయంలో ఆమె భర్త ఆస్పత్రిలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన ఇంటికి చేరుకున్నారు. కాగా.. శనివారం ఉదయం పోలీసులు నిందితుడిని అరెస్టు  చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం