ప్రేమిస్తున్నానని నమ్మించి.. ఫోటోలతో బెదిరింపులు..!

By telugu news teamFirst Published Nov 21, 2020, 10:01 AM IST
Highlights

తనకుమార్తెకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడని.. అతను తన కూతురి స్నేహితుల ఫోన్ నెంబర్ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని లేదంటే.. తన వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడని వాపోయాడు.
 


ప్రేమిస్తున్నానంటూ వెంటపడతాడు. పెళ్లిచేసుకున్నానంటూ నమ్మిస్తాడు. ఆ తర్వాత వాళ్లు తన ట్రాప్ లో పడిపోగానే తన అసలు రూపం బయటపెడతాడు. తనతో తీసుకున్న ఫోటోలు, వీడియోలు చూపించి వారిని బెదిరించడం మొదలుపెడతాడు. కాగా.. మాయ మాటలతో చాలా మంది అమ్మాయిలను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నైకి చెందిన ఓ  కళాశాల విద్యార్థిని తండ్రి ఇటీవల అడయారు డిప్యుటీ కమిషనర్ ని కలిశారు. తనకుమార్తెకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడని.. అతను తన కూతురి స్నేహితుల ఫోన్ నెంబర్ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని లేదంటే.. తన వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడని వాపోయాడు.

కమిషనర్ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని తండయారుపేట ముత్తమిళ్ నగర్ కి చెందిన అరుణ్ క్రిస్టోఫర్(25)గా గుర్తించారు. ఇంజినీరింగ్ చదివిన అతను విద్యుత్ బోర్డులో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా యువతితో పరిచయం పెంచుకొని.. ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు.

ఆమె వ్యక్తిగత ఫోటోలను పంపాలని అడిగినప్పుడు నమ్మకంతో ఆమె పంపింది. విద్యార్థిని స్నేహితురాళ్లకు సైతం అరుణ్ ఇలాంటి మెసేజ్ లు పంపించాడు. జరిగిన మోసాన్ని బాధితురాలు తన తండ్రికి వివరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. పోలీసుల దర్యాప్తులో అరుణ్ ఇలానే చాలా మంది అమ్మాయిలను మోసం చేసినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!