తాలిబాన్లు భారత్ వైపు కన్నెత్తి చూడరు.. ఎందుకంటే..! యూపీ సీఎం వ్యాఖ్యలు

By telugu teamFirst Published Nov 1, 2021, 5:00 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌‌లకు ప్రమాదమున్నదేమో కానీ, భారత్‌కు ఎలాంటి సమస్య ఉండబోదని అన్నారు. తాలిబాన్లు భారత్ వైపు కన్నెత్తి చూడరని తెలిపారు. ఎందుకంటే వారు భారత్ వైపు వస్తే గగనతల దాడులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
 

లక్నో: Uttar Pradesh ముఖ్యమంత్రి Yogi Adityanath తాలిబాన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. Talibanలతో అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌లు గందరగోళంలో ఉన్నాయని, కానీ, Indiaకు ఆ పరిస్థితి రాదని అన్నారు. వారు భారత్‌ వైపు కన్నెత్తి కూడా చూడబోరని తెలిపారు. ఒకవేళ వారు భారత్ వైపు కదిలితే.. గగనతల దాడులు సిద్ధంగా ఉన్నాయని వాళ్లకు తెలుసు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర Narendra Modi సారథ్యంలో భారత్ సేఫ్‌గా ఉన్నదని వివరించారు. భారత్ పవర్‌ఫుల్ అని తెలిపారు.

సామాజిక్ ప్రతినిధి సమ్మేళన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై విమర్శలు సంధించారు. ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. ఆయన కేవలం కుటుంబాన్ని  అభివృద్ధి చేయాలనుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. రాజ్‌భర్ కమ్యూనిటీ నుంచి తన క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులున్నారని, అందులో  ఒకరు మహారాజ సుహల్దేవ్ స్మారకభవనాన్ని నిర్మించడానికి వ్యతిరేకించారని, మరొకరు కచ్చితంగా కట్టి తీరాలని
చెప్పినట్టు వివరించారు. నేడు బహ్రెయిచ్‌లో భారీ స్మారక భవనాన్ని నిర్మించాలని వివరించారు. ముహమ్మద్ ఘోరి, ఘాజీల శిష్యులే సుహెల్దేవ్ స్మారకాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపైనా విమర్శలు కురిపించారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నా అందరూ ఒకే విద్యాసంస్థలో బారిస్టర్ చదివారని, దేశ స్వాతంత్ర్యం కోసం వెన్నుచూపని పోరాటం చేశారని వివరించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఒక భావజాలాన్ని నిషేధించారని అన్నారు. నేడు ఆ భావజాల ప్రజలే దేశాన్ని మతం, కులం ఆధారంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని తెలిపారు. సర్దార్ పటేల్ నేటి పరిస్థితులను అప్పుడే అర్థం చేసుకున్నారని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Also Read: టార్గెట్ 2024: పీఎం మోడీ, యూపీ సీఎం యోగి ఇలాకాలో ప్రియాంక గాంధీ హల్‌చల్.. అందుకోసమేనా?

తాజాగా, అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌ల సరసన జిన్నాను ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ సర్దార్ పటేల్‌తో జిన్నాను పోల్చారని, ఇది సిగ్గుచేటు అని విమర్శించారు. విచ్ఛిన్నం చేసే తాలిబాన్ మెంటాలిటీనే ఇది అని వివరించారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ లక్ష్యాన్ని సాధించే కృషి జరుగుతున్నదని తెలిపారు.

ప్రత్యర్థ పార్టీలపైనా సీఎం యోగి ఆదిత్యానాథ్ విమర్శలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు దేశాభివృద్ధికి పాటుపడవని తెలిపారు. వాటికి కుటుంబాల అభివృద్ధే ముఖ్యమని వివరించారు. సమాజ్ వాదీ పార్టీని విమర్శిస్తూ.. రామ భక్తులను హతమార్చినవారికీ దేశాన్ని క్షమించాలని అడిగే ధైర్యమున్నదా? అని అడిగారు.

Also Read: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం: ఫస్ట్ ఫేజ్ పూర్తి, దర్శనం అప్పటి నుంచే..!!

అఖిలేశ్ యాదవ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత తండ్రి ములాయం సింగ్ యాదవ్ కూడా ఆందోళనలో పడి ఉంటాడని బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి అన్నారు. దేశ విభజనలో భారత్ దేశం మహ్మద్ అలీ జిన్నాను ఒక విలన్‌గా చూస్తుందని తెలిపారు. అలాంటి జిన్నాను స్వాతంత్ర్య సమరంలో హీరోగా చెప్పడమంటే కేవలం ముస్లింలను ఆకట్టుకునే రాజకీయాలేనని ఆరోపణలు చేశారు.

click me!