UP electricity rates reduced: ఎన్నిక‌ల వేళ రైతులకు శుభ‌వార్త చెప్పిన సీఎం యోగి.. సగానికి సగం తగ్గింపు..

Published : Jan 09, 2022, 03:02 AM IST
UP electricity rates reduced: ఎన్నిక‌ల వేళ రైతులకు శుభ‌వార్త చెప్పిన సీఎం యోగి.. సగానికి సగం తగ్గింపు..

సారాంశం

UP electricity rates reduced: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర​ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోరు బావులు వినియోగించే రైతులకు ఉపశమనం కలిగించేలా.. విద్యుత్ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రేట్లను 50 శాతం తగ్గించింది.  

UP electricity rates reduced:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురుస్తోంది. తాజా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రైతులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. వ్యవసాయ విద్యుత్ చార్జీల ధరలను సగానికి సగం తగ్గించారు. యోగి స‌ర్కార్ నిర్ణ‌యంతో రైతులకు ప్రయోజనం చేకూరనున్న‌ది. దాదాపు 13 లక్షల మంది రైతులు ఈ నిర్ణ‌యంతో ల‌బ్ది పొంద‌నున్నారు.   ఏకంగా 50శాతం విద్యుత్ టారిఫ్‌ను త‌గ్గించడంతో రైతులు ఊరట లభించనుంది.  

 
ప్రతిపాదిత కొత్త రేట్ల ప్రకారం..  ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల ఉన్న వారు యూనిట్  ధ‌ర ₹2కి బదులుగా యూనిట్‌కు 1 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు త‌గ్గించింది. గొట్టపు బావుల యూనిట్ ధ‌ర‌  ₹1.65కి బదులుగా యూనిట్‌కు 83 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.పట్టణాల్లో ఫిక్స్​డ్ ఛార్జీల రేటు హార్స్​పవర్​కు రూ.130 నుంచి రూ.65కు... గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు తగ్గించింది. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్​పవర్​కు రూ.170 నుంచి రూ.85కు పరిమితం చేసింది.
  
రైతుల సౌలభ్యం, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా విద్యుత్ రేట్లలో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాల‌యం ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో  యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్​పై రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది.

ఇదిలాఉంటే.. సమాజ్‌వాదీ పార్టీ (SP) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని త‌మ పార్టీ  ఏర్పాటు చేస్తే..  రైతులకు ఉచిత విద్యుత్  సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌నీ, గృహ విద్యుత్ వినియోగదారులందరికీ 300 యూనిట్లు వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని ప్రకటించారు. విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామని కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది.

ఏడు విడతల్లోదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !