చివరి క్షణంలో పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. వధువు ఏం చేసిందంటే..

Published : May 24, 2023, 03:46 AM IST
చివరి క్షణంలో పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. వధువు ఏం చేసిందంటే..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి, యువకుడు మధ్య సుమారు రెండున్నరేళ్లగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరి క్షణంలో వరుడి మూడ్ మారిపోయింది.    

ఉత్తరప్రదేశ్‌లో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓ యువతి, యువకుడు సుమారు రెండున్నరేళ్ల ప్రేమ వ్యవహారం తర్వాత ..పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, మండపాన్ని కూడా అలంకరించారు. అయితే చివరి క్షణంలో వరుడి మూడ్ మారిపోయింది. ఎవరికి చెప్ప పెట్టకుండా పెళ్లి మండపం  నుండి పారిపోయాడు. ఎంతసేపటికి వరుడు రాకపోవడంతో వధువు స్వయంగా అతడిని వెతకడానికి బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో పారిపోతున్న వరుడిని వధువు గుర్తించింది. ఇంకేముంది.. పట్టుబట్టి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన బరేలీ జిల్లాకు సంబంధించినది.  

వివరాల్లోకెళ్లే.. బరేలీలోని పాతబస్తీకి చెందిన ఓ అమ్మాయి, బదౌన్‌లోని బిసౌలీలో నివాసముంటున్న ఓ యువకుడితో సుమారు రెండున్నరేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇద్దరూ జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఒకరికరూ వాగ్దానం చేసుకున్నారు. ఇంతలో విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి బాలిక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఆ యువతి తన ప్రేమికుడిని కూడా పెళ్లికి ఒప్పించింది. ఆదివారం భూతేశ్వర్‌నాథ్ ఆలయంలో బాలిక కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసేందుకు సన్నాహాలు చేశారు.

పెళ్లికూతురుగా ముస్తాబైన వధువు వరుడి కోసం ఎదురుచూస్తూ అలంకరించుకుని కూర్చుంది. వరుడు చాలా సేపటికి మండపం వద్దకు రాకపోవడంతో వధువు అతడికి ఫోన్ చేసి ఆరా తీయగా అతడు పారిపోయేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. ఆ తర్వాత వధువు మండపం నుంచి లేచి వరుడిని పట్టుకునేందుకు స్వయంగా  బయటకు వెళ్లింది. ఈ క్రమంలో బరేలీ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భమోరా వద్ద బస్సులో వరుడిని పట్టుకుంది. వరుడు తన తల్లిని తీసుకెళ్తానని, ఆ తర్వాత తానే బట్టలు వేసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే వధువు ఒక్కడి మాట వినలేదు.అయితే ఏది ఏమైనా వధువు మాత్రం వరుడిని వదిలిపెట్టేందుకు ఇష్టపడలేదు. చివరకు ఇరు కుటుంబాల సమక్షంలో  వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?