
UP assembly election 2022: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గపడుతుండటంతో ముఖ్యంగా బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ గా మారింది. ఈ క్రమంలో బీజేపీ ఎలాగైనా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వూహ్య రచన చేస్తుంది. ఈ క్రమంలో ఇతర పార్టీలో ఉన్న ప్రధాన నాయకులను బీజేపీ తన పార్టీలోకి లాగేస్తుంది.
తాజాగా.. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav)కు అత్యంత సన్నిహితుడైన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా((Shiv Kumar Beria)ను బీజేపీ స్వాగతించింది. ఆయన సోమవారం పార్టీలో చేరి కాషాయ కడువా కప్పుకున్నారు. శివకుమార్.. సమాజ్‌వాదీ ప్రభుత్వ హయాంలో బేరియా మంత్రిగానూ పనిచేశారు. అలాగే.. ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ మిశ్రా కూడా పార్టీకి వీడ్కొలు చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీకి మరో సారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పటికే.. ములాయం సింగ్ యాదవ్ బావ , యూపీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కూడా జనవరి 20న కాషాయ పార్టీలో చేరారు. ఇటీవలే బీజేపీని వీడి జనవరి 13న ఎస్పీలో చేరిన ధౌరాహ్రా ఎమ్మెల్యే బాల ప్రసాద్ అవస్తీ మళ్లీ కాషాయ పార్టీలోకి వచ్చారు.
ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈ చేరికలు వచ్చాయి. అపర్ణా యాదవ్ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్టీలో చేరుతున్నప్పుడు, అపర్ణా యాదవ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడో "ప్రధానమంత్రి [ప్రధానమంత్రి నరేంద్ర మోడీ]చే ప్రభావితమయ్యని అన్నారు
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 14న రెండో విడత, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న 6 వ విడత, మార్చి 7వ 7 వ విడత(చివరి) ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ లెక్కింపు మార్చి 10న చేపట్టనున్నారు.