up assembly election 2022 : సమాజ్ వాదీ పార్టీలో చేరిన భారతదేశ ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్..

By team teluguFirst Published Jan 23, 2022, 10:46 AM IST
Highlights

భారతదేశ అత్యంత ఎత్తైన వ్యక్తిగా పిలిచే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో శనివారం చేరారు. ఆయన చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ తెలిపారు. 

భారతదేశపు అత్యంత ఎత్తైన వ్యక్తి పిలిచే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ (darmendra prathap singh) సమాజ్ వాదీ (samajwadi)  పార్టీలో శనివారం చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన సింగ్ 2.4 మీటర్ల (8 అడుగుల 1 అంగుళం) ఎత్తు ఉన్నారు. ఆయ‌న ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్ల త‌క్కువ‌గా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ (naresh utham patel) మాట్లాడారు. ప్ర‌తాప్ సింగ్ పార్టీలోకి వ‌స్తున్నార‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ చేరిక పార్టీకి బ‌లాన్ని చేకూరుస్తుంద‌ని చెప్పారు. 

ఈ చేరిక ప‌ట్ల స‌మాజ్ వాదీ అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌదరి (rajendra choudari) స్పందించారు. “ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్‌ను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.’’ అని చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు కార‌ణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ.. తాను బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నాన‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ‘‘ ప్రజలు నాతో ఫొటో తీసుకోవాలని అనుకున్నప్పుడు.. నేను ఒక సెలబ్రెటీలా ఫీల్ అవుతాను’’ అని అన్నారు. ‘‘ ప్రజల్లో నేను చాలా పాపులర్ అయ్యాను. దీని కారణం నా ఎత్తే’’ అని చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ‌ర‌కు ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి సీఎం అభ్య‌ర్థులుగా ఉన్న ఇద్ద‌రూ మొద‌టి సారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో బీజేపీ (bjp) నుంచి సీఎం యోగి ఆధిత్య‌నాథ్ (cm yogi adhityanadh) గోర‌క్ పూర్ అర్బ‌న్ (gorakhpur arban) నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయ‌న గోర‌క్ పూర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌ప్పుడే సీఎం ప‌ద‌వి చేప‌ట్టారు. అనంత‌రం శాస‌న‌మండ‌లికి ఎన్నికై పూర్తి కాలం పాటు పాలించారు. స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయ‌నున్నారు. 

ఇదిలా ఉండ‌గా, యూపీ (up)లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ కొద్దీ ఒక పార్టీ నుంచి నాయ‌కులు మ‌రో పార్టీలో జంప్ అవుతున్నారు. అధికార బీజేపీలో, ప్ర‌భుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న ముగ్గురు మంత్రులు, 5 గురు ఎమ్మెల్యేలు స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. అలాగే స‌మాజ్ వాదీ పార్టీ నుంచి కూడా పలువురు బీజేపీలో చేరుతున్నారు. ఇటీవ‌లే ములాయం సింగ్ యాద‌వ్ చిన్న కోడ‌లు అపర్ణా యాద‌వ్ (aprna yadav) బీజేపీలో చేరారు. 

click me!