Coronavirus in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా టెర్రర్.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 10:09 AM IST
Highlights

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 3.92 కోట్లకు చేరింది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల (Corona cases) సంఖ్య 3,92,37,264కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా‌తో 525 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,59,168‌ మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి జయించినవారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేట్ 17.78 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 16.87 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.18 శాతం, మరణాల రేటు 1.25 శాతం, యాక్టివ్ కేసులు 5.57 శాతంగా ఉన్నాయి.శనివారం రోజున (జనవరి 22) దేశంలో 18,75,533 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,55,20,580కి చేరింది.  

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 71,10,445 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,92,84,270కి చేరింది. 

ఇక, మహారాష్ట్రలో శనివారం కొత్తగా 46,393 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 74,66,420కి చేరుకుంది. తాజాగా కరోనాతో 48 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,071కి చేరుకుంది. రాష్ట్రంలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. 

click me!