మూర్ఛ వచ్చి పడిపోయిన డ్రైవర్.. బస్సు నడిపిన మహిళా ప్రయాణికురాలు..!

By Ramya news teamFirst Published Jan 17, 2022, 1:02 PM IST
Highlights

బస్సులోని ప్రయాణిలకులంతా బయడిపోయారు. కానీ..  ఓ మహిళ వారందరి ప్రాణాలు కాపాడింది. డ్రైవర్ స్థానాన్ని ఆమె అందుకొని వారందరినీ గమ్య స్థానానికి చేర్చింది. 

వారంతా బస్సులో.. పిక్ నిక్ వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అనూహ్యంగా డ్రైవర్ అనారోగ్యానికి గురయ్యాడు. మూర్ఛ వచ్చి పడిపోయాడు. దీంతో.. ఆ బస్సులోని ప్రయాణిలకులంతా బయడిపోయారు. కానీ..  ఓ మహిళ వారందరి ప్రాణాలు కాపాడింది. డ్రైవర్ స్థానాన్ని ఆమె అందుకొని వారందరినీ గమ్య స్థానానికి చేర్చింది. జనవరి 13న మహారాష్ట్రలోని మొరాచి చించోలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. యోగితా ధర్మేంద్ర సతవ్ అనే మహిళ జనవరి 13న మరో 23 మంది మహిళలతో కలిసి పూణే సమీపంలోని మొరాచి చించోలీ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళింది. వీరంతా బస్సులో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాలు చుట్టివచ్చారు.

విహార యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమయిన సమయంలో బస్సులో ప్రయాణిస్తుండగా..బస్సు డ్రైవర్ ఒక్కసారిగా మూర్చిల్లిపోయాడు. ఇది గమనించిన టూర్ నిర్వాహకురాలు ఆశా వాఘమారే..ప్రయాణికులను అప్రమత్తం చేసింది. బస్సు డ్రైవర్ పరిస్థితిని గమనించిన యోగితా.. చాకచక్యంగా వ్యవహరించి బస్సు స్టీరింగ్ అందుకుంది. ఎంతో జాగ్రత్తగా 10 కిలోమీటర్ల దూరం బస్సు నడిపిన యోగితా..తనతో పాటు తోటి ప్రయాణికులను రక్షించింది. యోగితా బస్సు నడుపుతున్న సమయంలోనే డ్రైవర్ మరోసారి మూర్చిల్లిపోయాడు. దీంతో అతన్ని సమీప గ్రామంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

click me!