UP Opinion Poll 2022: మళ్లీ బీజేపీ కే అధికారం దక్కనుందా..? ఓపినియన్ పోల్ ఏం చెబుతోంది..!

By Ramya news teamFirst Published Jan 17, 2022, 12:24 PM IST
Highlights

రాష్ట్రంలోని 403 స్థానాలపై 21 డిసెంబర్ 2021 నుండి 9 జనవరి 2022 వరకు నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో బిజెపి ఇక్కడ 226 నుండి 246 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. 

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలు కూడా మొదలుపెట్టాయి. కొన్ని పార్టీలు.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో.. ఈ ఏడాది అక్కడ అధికారం చేజెక్కించుకునే సత్తా ఎవరికి ఉంది..? ఈ ఎన్నికలపై ఓపీనియన్ పోల్ ఏం చెబుతుందో.. ఓసారి చూద్దాం..

ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది కూడా..  కషాయం జెండా ఎగిరేలా కనపడుతోంది. ఇప్పటికే తమ విజయంపై బీజేపీ  చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 403 స్థానాలపై 21 డిసెంబర్ 2021 నుండి 9 జనవరి 2022 వరకు నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో బిజెపి ఇక్కడ 226 నుండి 246 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ 160 స్థానాలకు చేరుకోగా, బీఎస్పీ 12, ప్రియాంక నేతృత్వంలోని కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకు తగ్గినట్లు తెలుస్తోంది.

ఇండియా టీవీ, జన్ కీ బాత్ అభిప్రాయ సేకరణ ప్రకారం, ఏ పార్టీ ఖాతాలో ఎంత శాతం ఓట్లు ఉన్నాయి,
బీజేపీకి ఈసారి 39 నుంచి 40 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.  ఎస్పీ ఖాతాలో గరిష్టంగా 36 శాతం, బీఎస్పీకి 13.5 శాతం ఓట్లు రావచ్చు అని ఒపీనియన్ పోల్ లో తేలింది. కాంగ్రెస్‌కు ఈసారి 6 శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉందట. యూపీ ప్రజల్లో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కంటే 7.5 శాతం ఓట్లు ఎక్కువగా రావడం విశేషం.

ప్రాధాన్య అభ్యర్థి ఎవరు
ముఖ్యమంత్రి కోసం ఉత్తరప్రదేశ్‌లోని 56% మంది ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇష్టపడుతున్నారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ని  32 శాతం మంది కోరుకుంటున్నారు. బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి ఇప్పుడు కేవలం 9 శాతం మంది ప్రజల ఎంపిక చేయడం గమనార్హం.. అయితే అంతకుముందు నిర్వహించిన సర్వేలో ఆమోరె  ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేవలం 2 శాతం మంది మాత్రమే ఇష్టపడుతున్నారు. యూపీ ఎన్నికల పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను కేవలం 2 శాతం మంది మాత్రమే సీఎం అభ్యర్థిగా ఇష్టపడుతుండటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లోని దాదాపు 85శాతం ప్రజలు.. మళ్లీ యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే... యోగి గెలవాలని కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన అభివృద్ధి పనులే ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు పడతాయి. అయితే మోదీ వల్ల ఉత్తరప్రదేశ్‌కు ప్రయోజనం ఉండదని 15 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ వారణాసి ఎంపీ కావడం గమనార్హం. గత రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
 

click me!