
కరడుగట్టిన నేరస్తుడు రాహుల్ అలియాస్ స్టార్ రాహుల్ (star rahul) పై బెంగళూరు సౌత్ డివిజన్ పోలీసులు ఆదివారం రాత్రి కాల్పులు జరిపారు. స్టార్ రాహుల్ పై నాలు హత్యాప్రయత్నాల కేసులు ఉన్నాయి. దీంతో పాటు అతడు కుల్లా రిజ్వాన్ ఆర్గనైజ్ డ్ క్రైమ్ సిండికేట్‌లో (kulha rizwan organized crim sindicate) కీలక సభ్యుడు. ఈ సిండికేట్ బెంగళూరు నగడరంలోని పలు ప్రాంతాల్లో దోపిడీ, జూదం, గంజాయి సరఫరా వంటి పలు అసాంఘిక కార్యకలపాల్లో విస్తృతంగా పాల్గొంటోంది. స్టార్ రాహుల్ పై ఇప్పటి వరకు దాదాపు 20 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
రాహుల్ ను పట్టుకోవడానికి పోలీసులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ (narcotics) కేసును దర్యాప్తు చేస్తున్న కేజీ నగర్ పోలీసులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. హనుమంత్‌నగర్ పీఎస్ పీఎస్‌ఐ బసవరాజ్ పాటిల్ (psi basavaraj patil) ఆధ్వర్యంలో అతడిని కనిపెట్టేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సమాచారం ఆధారంగా కోనన్‌కుంటె పీఎస్ పరిధిలోని నారాయణ్‌నగర్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని లొగింపోవాలని పోలీసులు కోరారు. దీనికి స్టార్ రాహుల్ నిరాకరించాడు. అతడి వద్ద ఉన్న పొడవాటి కత్తితో హెడ్ కానిస్టేబుల్ నింగప్పపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వార్నింగ్ షాట్ పేల్చాడు. పీఎస్ఐ అతడి కాళ్ళపై కాల్పులు జరిపాడు. దీని వల్ల స్టార్ రాహుల్ కుడికాలుకు గాయమైంది. గాయాలపాలైన ఇద్దరినీ వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇద్దరూ ప్రాణాపాయం నుండి ప్రస్తుతం కోలుకుంటున్నారని సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.