బెంగాల్‌లో ఆగని హింస: కేంద్ర మంత్రి మురళీధరన్‌ కాన్వాయ్‌పై దాడి, సిబ్బందికి గాయాలు

Published : May 06, 2021, 01:34 PM ISTUpdated : May 06, 2021, 01:52 PM IST
బెంగాల్‌లో ఆగని హింస: కేంద్ర మంత్రి మురళీధరన్‌ కాన్వాయ్‌పై దాడి, సిబ్బందికి గాయాలు

సారాంశం

కేంద్ర మంత్రి వి. మురళీధరన్  కాన్వాయ్ పై  గురువారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో మంత్రి వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ దాడిలో మంత్రి కారు ధ్వంసమైంది. ఈ దాడి టీఎంసీ కార్యకర్తల పనేనని కేంద్రమంత్రి ఆరోపించారు. 

కోల్‌కత్తా: కేంద్ర మంత్రి వి. మురళీధరన్  కాన్వాయ్ పై  గురువారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో మంత్రి వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ దాడిలో మంత్రి కారు ధ్వంసమైంది. ఈ దాడి టీఎంసీ కార్యకర్తల పనేనని కేంద్రమంత్రి ఆరోపించారు. గురువారం నాడు వెస్ట్ మిడ్నపూర్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి మురళీధరన్  వెళ్తుండగా  గుర్తు తెలియని దుండగులు ఆయన కాన్వాయ్ పై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు ధ్వంసమైంది. మంత్రి సిబ్బంది గాయపడ్డారు. 

 

also read:ప్రధాని మోడీకి మమతా బెనర్జీ కృతజ్ఞతలు.. కేంద్రానికి సహకరిస్తానన్న దీదీ

బెంగాల్ రాష్ట్రంలో  ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత  రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. బీజేపీ నేతలు,కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని టీఎంసీ తమపై దాడికి దిగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.బెంగాల్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఎన్నికలకు ముందు డీజీపీగా ఉన్న వీరేంద్ర ను మమత బెనర్జీ తిరిగి డీజీపీగా నియమించారు. ఈసీ నియమించిన డీజీపీని బదిలీ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్