మారని జనం : ఆ రాష్ట్రంలో ఒక్కరోజే మాస్కులేని 22వేల మందిపై కేసులు.. !!

By AN TeluguFirst Published May 6, 2021, 11:46 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారు. తమిళనాడులో ఒక్కరోజే మాస్కుల పెట్టుకోని 22 వేల మందిపై కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారు. తమిళనాడులో ఒక్కరోజే మాస్కుల పెట్టుకోని 22 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. 

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే కోవిడ్ నిబంధనలు పాటించని 22వేలమందిమీద పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరినుంచి జరిమానా కింద రూ.43.97 లక్షలు వసూలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపత్యంలో ముఖ్యంగా, ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని, బయట తిరిగే సమయంలో మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. 

కానీ, జనాలు మాత్రం వీటిని తుంగలో తొక్కుతున్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పుంజుకుంటోంది. నిబంధనలు పాటించకపోవడంతోనే వైరస్ వ్యాప్తి అధికమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ మేరకు వైద్య నిపుణుల హెచ్చరికలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాలు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ, నిబంధనలు పాటించని వారిమీద కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా వసూలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే మంగళవారం మాస్క్ ధరించకుండా తిరుగుతున్న 21,980మందిమీద కేసులు నమోదు చేశారు. వీరినుంచి రూ.43,97,200 జరిమానా వసూలు చేశారు. అలాగే భౌతిక దూరం పాటించని 550 మంది నుంచి రూ.2.75 లక్షల జరిమానా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!