
ఈ నెల 8 నుండి 14 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. బుధవారం నాడు ఒక్క రోజులోనే కేరళలో 41,953 కరోనా కేసులు రికార్డయ్యాయి. కేరళలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహించాయి. కరోనా కేసుల వ్యాప్తికి ఈ సభలు కూడ కారణంగా మారాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు గాను రాష్ట్రంలో ఈ నెల 8 నుండి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ సీఎం నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నెల 8వ తేదీ ఉదయం ఆరుగంటల నుండి లాక్‌డౌన్ అమల్లోకి వస్తోందన్నారు. సీఎం ఆదేశాల మేరకు లాక్‌డౌన్ ను అమలు చేయనున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై సీఎం విజయన్ అధికారులతో చర్చించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని విజయన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.