ప్రతిపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్ బలహీనపడటం కాదు - జైరాం రమేష్

By team teluguFirst Published Sep 12, 2022, 3:59 PM IST
Highlights

ప్రతిపక్షాలు ఏకమవ్వడం అంటే కాంగ్రెస్ బలహీనపడినట్టు కాదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. విపక్ష పార్టీలన్నింటికీ కాంగ్రెస్ ఒక మూల స్తంభం లాంటిదని ఆయన అభివర్ణించారు. 

ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త అంటే కాంగ్రెస్ బ‌ల‌హీనప‌డ‌టం కాద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం ర‌మేష్ అన్నారు. విప‌క్షాల‌కు కాంగ్రెస్ ఒక ముఖ్య స్తంభం అని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేప‌థ్యంలో విప‌క్షాలు ఏకం అయ్యే అంశంపై ఆయ‌న సోమ‌వారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

త్రివిధ దళాల ఏకీకరణ దిశగా భారత్: రాజ్‌నాథ్ సింగ్

‘‘ విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనపరచడం కాదు.. మనల్ని మనం మరింత బలహీనపరచుకోబోమని మన మిత్రపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. మనల్ని మనం బలపరుచుకుంటాం.. బలమైన కాంగ్రెస్ ప్రతిపక్ష ఐక్యతకు ముఖ్యమైన మూలస్తంభం ’’ అని తెలిపారు. భారత్ జోడో యాత్రకు లభిస్తున్న మ‌ద్ద‌తు వ‌ల్ల బీజేపీ అయోమ‌యానికి గురైంద‌ని అన్నారు. ‘‘ భారత్ జోడో యాత్ర తర్వాత ఏనుగు మేల్కొంది. అది ముందుకు కదులుతోంది. కాంగ్రెస్ ఏం చేస్తోందో అన్ని పార్టీలు చూస్తున్నాయి’’ అని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. 

జ‌మ్మూకాశ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ద‌రించ‌బ‌డుతుంది: మెహబూబా ముఫ్తీ

భారత్ జోడో యాత్ర పార్టీని బలపేతం చేయడమే లక్ష్యంగా సాగుతోంద‌ని, కానీ ప్రతిపక్షంలో ఐక్యతను తెస్తే దానిని తాము స్వాగతిస్తామ‌ని జైరాం ర‌మేష్ అన్నారు. ‘ భారత్ జోడో యాత్ర మన్ కీ బాత్ కాదు. ఇది ప్రజల ఆందోళన గురించి చెబుతుంది. కానీ ఇది బీజేపీకి ఇంత ఆందోళనగా మారుతుందని నాకు తెలియదు. వారు వణికిపోతున్నారు ’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ‘ఐక్యత’ ఎజెండాపై కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య అనేక సమావేశాలు జరిగిన నేపథ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలతో గత వారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

జ్ఞానవాపి కేసు‌పై కోర్టు కీలక నిర్ణయం.. హిందూ మహిళల పిటిషన్ విచారణకు అంగీకారం

ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, తన ప్రయత్నాలు కొనసాగుతాయని ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం నితీష్ కుమార్ చెప్పారు. ప్రతిపక్ష నాయకులు త్వరలో ఐక్యమవుతారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతీ ఒక్కరూ దోహదపడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రెండు మూడు నెలల్లో ప్రధాని అభ్యర్థిపై తుది నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నేను ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థిని కాదు' అని కుమార్ అన్నారు.

click me!