త్రివిధ దళాల ఏకీకరణ దిశగా భారత్: రాజ్‌నాథ్ సింగ్ 

By Rajesh KarampooriFirst Published Sep 12, 2022, 3:19 PM IST
Highlights

సాయుధ బ‌ల‌గాల‌కు చెందిన త్రివిధ ద‌ళాల ఉమ్మ‌డి నిర్వ‌హ‌ణ దిశ‌గా భార‌త్‌లో వేగంగా అడుగులు ప‌డుతున్నాయ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  అన్నారు. 

సాయుధ బలగాలకు చెందిన త్రివిధ దళాల ‘ఏకీకరణ’ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం అన్నారు. న్యూఢిల్లీలో లాజిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ సెమినార్‌లో ప్రసంగిస్తూ.. కేంద్ర రక్షణ మంత్రి ఈ విషయం చెప్పారు. భార‌త్ రైల్వే రంగంలో వేగంగా పురోగమిస్తోందని, గత ఏడేళ్లలో 9,000 కి.మీలకు పైగా లైన్లను రెట్టింపు చేశామన్నారు. 2014కి ముందు ఈ సంఖ్య 1,900 కి.మీ మాత్రమేనని ఆయన చెప్పారు.

త్రివిధ దళాల సర్వీసుల 'సమీకరణ' దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని మానేక్షా సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏకీకరణ వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన రంగాల్లో లాజిస్టిక్స్‌ కూడా ఒకటన్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం మునుపెన్నడూ లేని విధంగా అనుసంధానమైందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పౌర‌, సైనిక వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌యిక వ‌ల్ల.. ప‌ర‌స్ప‌ర స‌హకార ధోర‌ణి ఉండాల‌ని, స‌మిష్టి త‌త్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బ‌ల‌ప‌డుతుంద‌ని అన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి బలమైన, సురక్షితమైన, శీఘ్ర లాజిస్టిక్స్ సరఫరా వ్యవస్థ అవసరమ‌ని అన్నారు. 

ప్రభుత్వం కీలక విధానాలను సిద్ధం

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ వేగంగా దూసుకుపోతోందని, నేడు మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో దేశంలో లాజిస్టిక్స్‌ను ఏకీకృతం చేయడానికి, స్వావలంబనగా మార్చడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన విధానాలను సిద్ధం చేసింది. సెమినార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ తదితరులు హాజరయ్యారు.

click me!