క్వాడ్ దేశాల గ్రూప్‌నకు పరిపూర్ణ రూపం: ప్రధాని మోడీ

By Siva KodatiFirst Published Mar 12, 2021, 10:06 PM IST
Highlights

క్వాడ్ దేశాల గ్రూప్‌ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం జరిగిన తొలి క్వాడ్ దేశాల వర్చువల్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి సుగ పాల్గొన్నారు

క్వాడ్ దేశాల గ్రూప్‌ పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం జరిగిన తొలి క్వాడ్ దేశాల వర్చువల్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి సుగ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఇండో - పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకు ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు. ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్ కోసం అంకితభావం భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లను సంఘటిత పరుస్తున్నాయని తెలిపారు.

స్వేచ్ఛాయుత, అరమరికలు లేని, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ కోసం చిత్తశుద్ధి, ప్రజాస్వామిక విలువలు మనల్ని సంఘటిత పరిచాయని చెప్పారు. క్వాడ్ దేశాల గ్రూప్‌నకు పరిపూర్ణ రూపం వచ్చిందని భారత్ ఆధారంగా నిలుస్తోందని తెలిపారు.

ఈ సానుకూల దృక్పథానికి మూలాలు వసుధైక కుటుంబం అనే ప్రాచీన భారతీయ తత్వంలో ఉందని చెప్పారు. వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని వివరించారు. మనమంతా కలిసి పని చేద్దామని, ఉమ్మడి విలువలను సమగ్రంగా అమలు చేసేందుకు మునుపెన్నడూ లేనంత సన్నిహితంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 

click me!