వివాహేతర సంబంధం: భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్, తుపాకితో కాల్చినా....

Published : Mar 12, 2021, 05:10 PM IST
వివాహేతర సంబంధం: భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్, తుపాకితో కాల్చినా....

సారాంశం

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు.  

న్యూఢిల్లీ:వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు.

 చిరాగ్ ఢిల్లీలో భీమ్ రాజ్ అనే వ్యక్తి భార్య భాటియాతో కలిసి నివసిస్తున్నాడు. భీమ్‌రాజ్‌ బీఎస్‌ఈఎస్‌లో పవర్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అతడి భార్యకు 23 ఏళ్ల రోహన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

ఈ విషయం తెలుసుకొన్న భీమ్ రాజ్ భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె తీరులో ఏ మాత్రం మార్పురాలేదు. ప్రియుడి రోహన్ తో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని కోరింది. దీంతో వీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు.

రోహన్ ఓ దేశీయ తుపాకీని సమకూర్చుకొన్నాడు. బుధవారం నాాడు భీమ్ రాజు కారులో వెళ్తుండగా నెంబర్ మార్చిన బైక్ పై వెంబడించి కారుకు ఎదురుగా నిలబడి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో భీమ్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.


టెక్నాలజీ సహాయంతో రోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఓ చిన్న ప్రమాదంలో తనకు భీమ్ రాజుకు మధ్య గొడవ జరిగిందని  అందుకే ఆయనను చంపాలనుకొన్నట్టుగా రోహన్ చెప్పారు. అయితే ఈ విషయం నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాన్ని చెప్పాడు.

బీమ్ రాజు భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందన్నారు. ఆమె సలహా మేరకు భీమ్ రాజును హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. 


 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families