
లండన్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న 40 ఏళ్ల వైద్యురాలు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలని మేఘా కయల్‌గా గుర్తించారు పోలీసులు. మేఘా కయల్ తల్లి గత రెండు రోజులు కిందటే మరణించింది. తల్లి మరణాన్ని తగ్గుకోలేక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లింది. ఈ క్రమంలో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలం నుండి సూసైడ్ నోట్ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. మృతురాలు తన తొడపై తీవ్రంగా గాయపరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మేఘా కయల్‌గా గత ఏడాది కాలంగా లండన్‌లోని మిల్టన్ కీన్స్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆమె ఢిల్లీలోని సరితా విహార్‌లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేశారు. మేఘా కయల్ తల్లి అనారోగ్యంతో జనవరి 27న చనిపోయింది. ఆమె తండ్రి కూడా క్యాన్సర్ పేషెంట్. ఆమె అవివాహిత . దీంతో డిప్రెషన్‌లో వెళ్లి ఉంటుందని పోలీసుల ప్రాధామిక దర్యాప్తులో తెలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7.40 గంటలకు, కయల్ రూంకి వెళ్లి పదేపదే పిలిచినప్పటికీ.. తన రూం డోర్ ఓపెన్ చేయలేదు. బయటకు రాకపోవడంతో కయల్ కోడలు డూప్లికేట్ కీని ఉపయోగించి ఆమె గది తలుపు తెరిచింది. గది లోపల కయల్ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె తొడపై. ఇతర ప్రాంతాలల్లో గాయపరుచుకుంది. వెంటనే, కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు, కానీ, ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని డిసిపి తెలిపారు.
ఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె చెప్పారు. తన తల్లి దూరం కావడాన్ని తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.