అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్: ఎయిమ్స్ లో చేరిక

By narsimha lodeFirst Published Jun 1, 2021, 1:05 PM IST
Highlights

 కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ మంగళవారం నాడు ఎయిమ్స్ లో చేరాడు.  ఇటీవలనే ఆయన  కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత  తలెత్తిన ఆరోగ్య సమస్యలతో రమేష్ పొఖ్రియాల్  ఆసపత్రిలో చేరినట్టుగా సమాచారం.


న్యూఢిల్లీ: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ మంగళవారం నాడు ఎయిమ్స్ లో చేరాడు.  ఇటీవలనే ఆయన  కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత  తలెత్తిన ఆరోగ్య సమస్యలతో రమేష్ పొఖ్రియాల్  ఆసపత్రిలో చేరినట్టుగా సమాచారం.రమేష్ పొఖ్రియాల్ వయస్సు 61 ఏళ్లు.  అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న రమేష్ పోఖ్రియాల్ ను  ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న రమేష్ పొఖ్రియాల్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

also read:కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌కి కరోనా: క్వారంటైన్‌లో మంత్రి

దేశంలో పలు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  సుమారు 54 రోజుల తర్వాత దేశంలో కరోనా కేసులు రెండు లక్షలకు దిగువకు చేరుకొన్నాయి.  పలు రాష్ట్రాలు పకడ్బందీగా లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలుతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియను చేపట్టాయి. డిళ్లీలో  అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది.

click me!