Rajeev Chandrasekhar EXCLUSIVE: ప్రధాని మోడీ టీమ్‌లో ఉండటం నిజంగా అద్భుతమైన గౌరవం

By Mahesh K  |  First Published Feb 12, 2024, 9:56 PM IST

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో తన రెండు దశాబ్దాల కెరీర్ గురించి మాట్లాడారు. 2జీ స్పెక్ట్రం స్కామ్ పై పోరాటం, ఉపా వంటి చట్టాలకు పాటుపడటం వంటి ఎన్నో విషయాలను ఆయన చెప్పుకువచ్చారు.
 


కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రెండు దశాబ్దాలపాటు ఎంపీగా సేవలు అందించారు. రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ 18 ఏళ్లకాలంలో ఆయన అనుభవాలను, విజయాలపై మాట్లాడారు. 2జీ స్పెక్ట్రం స్కామ్ బయటికి తేవడం, ఉపా చట్టాన్ని తేవడంలో క్రియాశీలక పాత్ర పోషించడం, నెట్ న్యూట్రాలిటీ, డేటా ప్రొటెక్షన్, ఇంటర్నెట్ గవర్నెన్స్ వంటి విషయాలపై వారు గళం విప్పారు. కన్నడ ప్రభకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమైన విషయాలను చర్చించారు.

రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండగా పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?

Latest Videos

ఆ రోజు ఉదయమే వీడ్కోలు సెషన్ ఉన్నదని తెలిసింది. అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. 18 ఏళ్ల నా పనిని కొన్ని నిమిషాల్లోకి కుదించడం చాలా కష్టం. బెంగళూరు, కర్ణాటక, దేశానికి సేవ చేయడంపై గర్వంగా ఉన్నాను. నా కుటుంబానికి, పార్టీ వర్కర్లు, నాయకులు, మద్దతుదారులకు కృతజ్ఞుడిని.

8 ఏళ్లపాటు ప్రతిపక్ష ఎంపీ, పదేళ్లు అధికార ఎంపీగా పని చేసినట్టు చెప్పారు. ఇందులో తేడా ఏమున్నది?

2006 నుంచి 2014 వరకు తొలి 8 ఏళ్లు నేను పార్లమెంటరీ రాజకీయాలు నేర్చుకున్నాను. అది ఆర్థికంగా, రాజకీయంగా చాలా కష్టమైన పని. 2006లో నేను ఎంపీగా పార్లమెంటుకు వెళ్లినప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. 

యూపీఏ ప్రభుత్వ హయాం స్కామ్‌లు, అవినీతిమయమే. యూపీఏ అవినీతి రాజకీయాలు లేకుంటే ఈ దేశం ఎంతో అభిృద్ధిలో ఉండేదో. ఒక ఎంటర్‌ప్రెన్యూవర్‌గా వారి అవినీతి పాలన, ఆర్థిక సంక్షోభాలు ఎంతటి దుష్ప్రభావాన్ని వేయగలవో అంచనా వేయగలను. ఆ ఎనిమిదేళ్లు 2జీ స్కామ్, స్పెక్ట్రం వేలం వంటి అనేక సంక్షోభాలను వెలికి తీయడంలో గడిపాను. నెట్ న్యూట్రాలిటీ, ఎన్పీఏ, బ్యాంకు రుణ సంక్షోభాలు వంటి విషయాలను బయటకు తేవడంలో పని చేశాను.

కార్గిల్ యుద్ధ విజయాన్ని సెలబ్రేట్ చేయలేదు. కార్గిల్ విక్టరీ డేను గుర్తించి వేడుక చేయాలని నేను విజ్ఞప్తి చేశాను. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గౌరవించేవాడిని. అధికారానికి వెలుపల ఉండి కూడా సోనియా గాంధీ ప్రభుత్వాన్ని నడపడాన్ని తొలిసారి చూశాను. ఇప్పుడు కర్ణాటకలో ఇదే స్థితి ఉన్నది.

ఆ ఎనిమిదేళ్లు దేశానికి పీడకల వంటిది. ప్రజలు అసంతృప్తితో రగిలిపోయారు. అందుకే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా మోడీ 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎంతో మార్పు వచ్చింది. 

గతంలో మీరు ఎంపీ, ఇప్పుడు మంత్రి. ప్రధాని మోడీ ప్రభుత్వంలో మంత్రిగా మీ ఆలోచనలేమిటీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో భాగంగా ఉండటం నాకు అద్భుతమైన గౌరవం. మోడీ రెండో హయాంలో ఆర్థిక వృద్ధి, భద్రత, అభివృద్ధి, సమాన అవకాశాలపై దృష్టి పెట్టడంతోపాటు కరోనా మహమ్మారిని రెండున్నరేళ్లపాటు కట్టడి చేయగలిగారు. ఆయన నాయకత్వంలో ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ రూపొందింది.

మా విధానాల్లో ఇండియన్ ఇంటర్నెట్ యూజర్ల సేఫ్టీ, ట్రస్ట్‌ బాధ్యతలను ప్లాట్‌ఫామ్‌లకే అప్పజెప్పాం. దేశీయంగా ఉత్పత్తులను పెంచాం. స్టార్టప్‌లు, యూనికార్న్‌లను ప్రోత్సహించాం. కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాలను తెచ్చాం. ఫలితంగానే కర్ణాటక, బెంగళూరులలో పెట్టుబడులు పెరిగాయి. 2014లో భారత్ అన్ని స్మార్ట్‌ఫోన్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అన్ని దేశీయంగానే తయారవుతున్నాయి. అంతేకాదు, ఒక కోటి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఎగమతి చేస్తున్నాం.

బెంగళూరులో ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్‌లో మొదటి నుంచి మీరు క్రియాశీలకంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది?

యెడియూరప్ప, దేవేగౌడ్‌లతోపాటు అనంత్‌కుమార్ కూడా కర్ణాటక రాజకీయాల్లో నాకు ముఖ్యమైన గురువులు. బెంగళూరు అభివృద్ధికి అనంత్ కుమార్ నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేవాడు.  2010లో నేను బెంగళూరు కోసం పదేళ్ల ప్లాన్ చేశాను. అనేక మందిని సంప్రదించి ఈ ప్రణాళిక రూపొందించాం. ఆ ప్లాన్ సజావుగానే మొదలైంది. కానీ, 2013లో సిద్ధరామయ్య ప్రభుత్వం రాగానే పట్టుతప్పింది. ఆ తర్వాత మళ్లీ బీజేపీ హయాంలో పుంజుకున్నా ఇప్పుడు గాడి తప్పింది. కానీ, మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ అభివృద్ధికి ఫోకస్ పెడుతారని ఆశిస్తున్నాను.

చట్టాలను అతిక్రమించే బిల్డర్లను, వారితో అధికారుల మిలాఖత్తును ఎలా అడ్డుకోగలం?

బెంగళూరులో ఇది ప్రాథమికంగా కనిపించే సమస్య. ఈ నగరాన్ని రక్షించి, పర్యవేక్షించాల్సిన అధికారులు నగరాన్ని దోచుకునే కొందరు బిల్డర్లతో చేతులు కలుపుతుంటారు. కానీ, అధికారంలో ఉన్నవారే ఈ వ్యవహారంలో ఉంటే.. భూకబ్జాలకు దిగితే.. అలాంటి వాటికి పరిష్కారాన్ని వెతకడం కష్టమే.

ఢిల్లీలో సిద్ధరామయ్య ప్రభుత్వ నిరసన గురించి ఏమంటారు?

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే నేను దీన్ని ఊహించాను. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల బాధ్యతారహిత ఖర్చులు, హామీలు, అవినీతి అంచనాతోనే బలమైన కర్ణాటక ఆర్థివ్యవస్థను కొల్లగొడుతారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఇదే జరిగింది. వీరి అబద్ధాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బట్టబయలు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగా కర్ణాటకకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.

సీనియర్ సోల్జర్లు, వారి కుటుంబాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బెంగళూరులో మిలిటరీ స్మారకం, కార్గిల్ దివస్ వంటి వాటిపై ఎందుకు ఆసక్తి?

నేను సీనియర్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కొడుకును. నా తండ్రి నుంచి, ఇంకా ఎందరో సీనియర్ సోల్జర్ల నుంచి నేను విలువలు నేర్చుకున్నాను. కాబట్టి, దేశానికి సేవ చేసే వారి కోసం ఏ రూపంలోనైనా సహకరించడం నా బాధ్యతగా భావిస్తాను. కల్నల్ వాసంత్, కల్నల్ జోజన్ థామ్, లాన్స్ ఎన్కే హనుమంతప్ప, మేజర్ ఉన్నిక్రిష్ణన్, వంటి అనేక మంది త్యాగాలను స్మరించే బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాను. 

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని చంద్రబాబుకు అమిత్ షా షరతు? అందుకే పొత్తు ప్రకటనలో జాప్యం?

ఎంపీగా, కేంద్రమంత్రిగా మీ రిపోర్ట్ కార్డ్ ఏమిటీ? మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు?

నా విజయాలు అనేకం. వాటన్నింటినీ ఇక్కడ ఏకరువు పెట్టను. కానీ,  నా వెబ్ సైట్ www.rajeev.in వెబ్ సైట్ సందర్శిస్తే మీకు ప్రాథమికంగా ఒక అవగాహన వస్తుంది. ఒక ఎంపీగా బెంగళూరుకు ఎంపీగా, మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పని బాధ్యతలు నిర్వర్తించడంలో మంచి రికార్డ్ ఉన్నది. కర్ణాటక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైంది. ఇక మార్కుల విషయానికి వస్తే.. నాపై ఉంచిన విశ్వాసానికి న్యాయం చేశాను.

ఎంటర్‌ప్రెన్యూవర్షిప్, టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండం్ ఉన్నవారు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో రాణిస్తున్నారు? దీన్ని మీరు ఎలా వివరిస్తారు?

నేను దీన్ని ఒక లైఫ్ మిషన్‌గా తీసుకుంటాను. దానికి 1000 శాతం కట్టుబడి ఉంటాను. పుష్కలంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి కొత్త దారులు ఎంచుకోవాలని తెలుసు. ఊరికే కూర్చోకుండా నేను నా బిజినెస్ కెరీర్ వదులుకుని ప్రజా జీవితంలోకి ప్రవేశించాను. మార్పు కోసమే అడుగుపెట్టాను. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఏ మార్పూ చూడలేదు. అప్పుడు మోడీ ప్రధాని అయ్యారు. అన్ని మారిపోయాయి. నేను కలలు గన్నవి నిజం కావడం మొదలయ్యాయి. భారత చరిత్రలో ముఖ్యమైన కాలంలో నేను పాలుపంచుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రధానమంత్రి మోడీ బలమైన దార్శనికత, అభివృద్ధి లక్ష్యానికి పాటుపడటంలో చిన్న పాత్ర పోషించినా ఆనందమే కదా.

click me!