బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణీకులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By narsimha lode  |  First Published Feb 12, 2024, 9:39 PM IST

ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణీకులు  గొడవ పడుతున్న ఘటనలు  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బెంగుళూరులో ఇదే తరహా ఘటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో రద్దీగా ఉన్న బస్సులో మహిళలు ఒకరినొకరు బూట్లతో  కొట్టుకొన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  సోషల్ మీడియాలో  రాకేష్ ప్రకాష్ అనే వ్యక్తి  ఈ వీడియోను పోస్టు చేశాడు.

బస్సులో  చిన్న విషయమై ఇరువురి మధ్య  గొడవ చోటు చేసుకుంది.  ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గొడవను ఆపాలని బస్సులోని తోటి ప్రయాణీకులు కూడ కోరారు. చివరికి బస్సును నిలిపివేసి ఇద్దరిని బయటకు వెళ్లిపోవాలని కూడ  కోరారు.ఈ వీడియోపై  నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. 

Latest Videos

also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో  మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించింది.  అయితే  తెలంగాణ రాష్ట్రంలో కూడ  మహిళల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల విషయంలో  గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సమయాల్లో  బస్సులోని ఇతర ప్రయాణీకులు  గొడవ పడుతున్న వారికి సర్ధి చెబుతున్నా కూడ పట్టించుకొనే పరిస్థితి కూడ లేకుండా పోయింది. మహిళల మధ్య గొడవల కారణంగా బస్సులు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరిన సందర్భాలు కూడ లేకపోలేదు.అయితే ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బస్సుల సంఖ్యను కూడ పెంచింది.  

also read:మీ విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించనుందా?: గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు

గతంలో  ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు, స్త్రీలకు మధ్య  అడ్డుగా ఉన్న బారికేడ్ తరహా వ్యవస్థను తొలగించారు. దీంతో ప్రతి బస్సులో అదనంగా నాలుగు సీట్లు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు దక్కనుంది. రెండు రోజుల క్రితం  కొత్త ఆర్టీసీ బస్సులను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  మరో వెయ్యి బస్సులను కూడ రాష్ట్ర ప్రభుత్వం  అందుబాటులోకి తీసుకురానుంది.  పురుషులకు కూడ  ప్రత్యేక బస్సులను నడిపింది ఆర్టీసీ

కర్ణాటక రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇదే తరహా పథకాన్ని తెలంగాణలో కూడ  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

click me!