కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీకి అస్వస్థత.. ఒక్క సారిగా క్షీణించిన ఆరోగ్యం

Published : Nov 17, 2022, 03:46 PM IST
కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీకి అస్వస్థత.. ఒక్క సారిగా క్షీణించిన ఆరోగ్యం

సారాంశం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించింది. ఆయనకు వెంటనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స ను అందించారు. 

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఒక్క సారిగా ఆరోగ్యం క్షీణించింది. నేషనల్ హైవే నెంబర్ 10 వెంట ప్రతిపాదిత 13 కిలో మీటర్ల నాలుగు వరుసల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే ఈవెంట్ కు హాజరైన సమయంలో ఇది చోటు చేసుకుంది. అయితే షుగర్ లెవెల్ తగ్గడం వల్లే ఇది జరిగిందని తెలుస్తోంది.

కొవాగ్జిన్‌కు ఆమోదంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఆ మీడియా రిపోర్ట్స్‌ను ఖండించిన కేంద్రం.. 

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గురువారం ఉదయం ఆయన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చేరుకున్నారు. అక్కడ రూ.1206 కోట్లతో చేపట్టిన 3 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం డార్జిలింగ్ జంక్షన్ సమీపంలోని దగాపూర్ మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అనంతరం సుక్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం అక్కడికి చేరుకుని వారికి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఆరోగ్యం ఉందని చెప్పారు. 

ఇలా నితిన్ గడ్కరీకి ఆరోగ్యం క్షీణించడం ఇదే మొదటిసారి కాదు. 2018 డిసెంబర్‌లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇలాగే జరిగింది. వేదికపై ఉండగానే నితిన్ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. ఆ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన వెంట ఉన్నారు. వేదికపై ఒక్క సారిగా కూలిపోతున్న ఆయనను గవర్నర్ కూర్చోబెట్టారు. అనంతరం గడ్కరీని హాస్పిటల్ కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu