ఇప్పట్లో ప్రజా రవాణా ప్రారంభించే అవకాశం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Apr 29, 2020, 2:15 PM IST
Highlights

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారంగా  కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేసుకొనే హక్కు రాష్ట్రాలకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. పరిస్థితుల ఆధారంగా గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నారు.


న్యూఢిల్లీ:  డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారంగా  కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేసుకొనే హక్కు రాష్ట్రాలకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. పరిస్థితుల ఆధారంగా గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నారు.

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.గ్రీన్ జోన్లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుమతించినట్టుగా మంత్రి తెలిపారు.తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ప్రజా రవాణా వ్యవస్థను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదన్నారు మంత్రి.తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన  12 కేజీల బియ్యంలో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవని, మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

ఇవాళ్టి నుండి రెండో ఫేజ్ కింద రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  కరోనా ప్రత్యేక ఆసుపత్రుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ. 215 కోట్లు ఇచ్చిందన్నారు.

also read:కోతులపై కరోనా వ్యాక్సిన్ సక్సెస్: వ్యాక్సిన్ తయారీకి పుణె సీరం ఇనిస్టిట్యూట్ రెడీ

గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న మత్స్యకారులను బస్సుల్లో ఏపీకి పంపామన్నారు. బుధవారం నాడు ఉదయానికి వారంతా ఏపీకి చేరుకొంటారన్నారు. ఏపీకి మత్స్యకారులను పంపేందుకు చర్యలు తీసుకొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో చిక్కుకొన్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభిస్తే కేంద్రం సహకరిస్తోందన్నారు.కరోనా ప్యాకేజీపై మరింత విస్తృతంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకొంటామని కేంద్ర మంత్రి సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

click me!