కోతులపై కరోనా వ్యాక్సిన్ సక్సెస్: వ్యాక్సిన్ తయారీకి పుణె సీరం ఇనిస్టిట్యూట్ రెడీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కోతులపై దీన్ని ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన కోతులకు కరోనా సోకలేదని ప్రకటించారు. దీంతో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు.
పుణె: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కోతులపై దీన్ని ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన కోతులకు కరోనా సోకలేదని ప్రకటించారు. దీంతో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు.
28 రోజులుగా ఆరు కోతులపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన కోతులకు కరోనా సోకలేదని నిర్ధారించారు. కోతులపై ఈ వ్యాక్సిన్ సక్సెస్ కావడంతో మనుషులపై ప్రయోగించనున్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ పనిచేస్తోంది. మనుషులపై ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే ఈ ఏడాది కనీసం 60 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయాలని సీరం ఇనిస్టిట్యూట్ భావిస్తోంది.
వ్యాక్సిన్ల ఉత్పత్తిలోనే ప్రపంచ ప్రసిద్దిగాంచింది సీరం ఇనిస్టిట్యూట్. మనుషులపై ప్రయోగం సక్సెస్ అయితే సెప్టెంబర్ మాసంలోనే వ్యాక్సిన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేలా ఈ ఇనిస్టిట్యూట్ ప్లాన్ చేస్తోంది.
వచ్చే నెలాఖరుకు మనుషులపై ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మనుషులపై ప్రయోగం సక్సెస్ అయితే సీరం ఇనిస్టిట్యూట్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు.మొదటి దశలోనే ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
గత నెలలో మోంటానాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లాబోరేటరీలో ఆరు కోతులకు టీకాలు వేశారు. ఈ కోతులకు కరోనా సోకలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత 28 రోజుల వరకు కోతులు ఆరోగ్యంగా ఉన్నాయని పరీక్ష నిర్వహించిన విన్సెంట్ మన్సర్ట్ చెప్పినట్టుగా ఆ పత్రిక తెలిపింది.
also read:నెలరోజుల్లోపే కరోనా వాక్సిన్: భారతీయ సంస్థ వెల్లడి...
మనుషులపై ప్రయోగాల కోసం 800 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రోఫెసర్ డాక్టర్ హిల్ టీమ్ తో తాము కలిసి పనిచేస్తున్నామని సీఈఓ అధర్ పుణావాల్లా చెప్పారు.
మొదటి మూడు నెలలకు ఐదు మిలియన్ డోస్ ఉత్పత్తి చేయనున్నారు. ఆ తర్వాత నెలకు 10 మిలియన్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి చేయనున్నారు.