కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వివరాలు..

Published : Apr 09, 2023, 09:31 AM IST
 కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వివరాలు..

సారాంశం

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా.. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా.. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శనివారం కిరణ్ రిజిజు కారును ట్రక్కు ఢీకొట్టింది. కిరణ్ రిజిజు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదం ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 

ఈ ఘటన అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును సురక్షితంగా ఆయన వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే దీనిని చిన్న ప్రమాదంగా పోలీసులు తెలిపారు. కిరణ్ రిజిజుకు ఎలాంటి గాయం కాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక, ప్రస్తుతం కిరణ్ రిజిజు జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఉదంపూర్‌లో న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు గంట ముందు ఈ ఘటన జరిగింది.
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..