
బెంగళూరు: వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ జరగ్గా.. 13వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనతా దళ్ సెక్యూరల్ లీడర్ హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరవచ్చని తెలిపారు.
ఎవరు తమ పార్టీలో చేరబోతున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచార్ (చిత్రదుర్గ నుంచి ) ఇప్పటికే తనతో మాట్లాడారని వివరించారు. త్వరలోనే జేడీఎస్ పార్టీలోకి వస్తారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ నుంచి 15 మంది నేతలు జేడీఎస్‌లో చేరనున్నారు.
గతంలో జేడీఎస్‌ను ముంచడానికి తమ నేతలను తీసుకుందని, ఇప్పుడు వారు జేడీఎస్‌లోకి తిరిగి వస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా జేడీఎస్‌ను బహిష్కరించిన నేత, మాజీ ఎంపీ ఎల్ ఆర్ శివరామే బీజేపీలో చేరారు.
తాను జేడీఎస్ ఎందుకు వీడాడో చెబుతూ, ‘నేను 40 ఏళ్లుగా రాజకీయంలో ఉంటున్నాను. యూత్ కాంగ్రెస్ నుంచి నా కెరీర్ ప్రారంభించాను. కానీ, కాంగ్రెస్, జేడీఎస్ ఈ రెండు పార్టీలకు బలమైన నాయకులు లేరు. ఈ రెండు పార్టీల్లోనూ అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలు రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. అసలు నీ సలహాలు వినే వారు కూడా ఎవరూ ఉండరు. అందుకే బీజేపీలో చేరతానని ఫిక్స్ అయ్యాను.
Also Read: శరద్ పవార్, అదానీ ఫొటోతో కాంగ్రెస్ అటాక్.. పవార్‌కు మద్దతుగా కౌంటర్ ఇచ్చిన ఫడ్నవీస్
జేడీఎస్ సీనియర్ లీడర్ ఏటీఆర్ రామస్వామి కూడా ఇటీవలే బీజేపీలో చేరారు.