
హైదరాబాద్: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న రీతిలో ఆలోచనలు చేసి అమలు పరుస్తున్నదని ఆయన కొనియాడారు. ఇదే విధంగా ఇంకా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో రాణిస్తున్నదని అన్నారు.
రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై ఆయన ఆదివారం సమీక్షలు నిర్వహించారు. ఈ సంద్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామాలను గ్రీన్ విలేజీలుగా మార్చడంపై శ్రద్ధ వహించాలని అన్నారు. హర్టికల్చర్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో కాలుష్య కారకాలను వాడకుండా చూడాలని చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో జీవన ఉపాధులపై దృష్టి పెట్టాలని వివరించారు.
Also Read: జాతీయ రాజకీయాల్లో ‘జై కిసాన్, జై జవాన్’ నినాదం కేసీఆర్‌ను గట్టెక్కిస్తుందా?
మహిళల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయేతర అంశాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి, సెర్ప్‌లను భాగస్వామ్యం చేసుకోవాలని వివరించారు.