
National Highway Toll Rates: దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్ ధరలు ఒకే విధంగా ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్లమెంట్ లో తమిళనాడుకు చెందిన రాజ్యసభ ఎంపీ కనిమొళి ఎన్‌వీఎన్ సోము టోల్ రేట్లపై ప్రశ్నించగా.. మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు.
సభలో కనిమొళి ఏం అడిగారు?
తమిళనాడు జాతీయ రహదారిపై కిలోమీటరుకు ఎంత టోల్ రేటు వాసులు చేస్తున్నారో తెలిపాలని పార్లమెంట్ లో తమిళనాడు ఎంపీ కనిమొళి ఎన్‌విఎన్ సోము.. ప్రశ్నించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని కోరారు. ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడులో టోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయా? మరి తమ రాష్ట్రంలోని ప్రయాణికులు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. దీనితో పాటు.. తమిళనాడులో 10 సంవత్సరాలకు పైగా ఉన్న టోల్ గేట్లలో టోల్ రేట్లు పెంచడం, టోల్ వసూలును ఉపసంహరించుకోవాలనే అభ్యర్థన కూడా పార్లమెంట్ లో లేవనెత్తారు.
కనిమొళి ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం
తమిళనాడు ఎంపీ కనిమొళి ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. తమిళనాడు సహా జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు దేశవ్యాప్తంగా టోల్‌లు ఒకే విధంగా ఉంటాయన్నారు. టోల్ ప్లాజాల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని గడ్కరీ అన్నారు. వసూలు చేసిన టోల్ ఆదాయాన్ని రోడ్ల అభివృద్ధి పరచడానికి ఉపయోగిస్తారనీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మద్దతు ఇస్తుందని అన్నారు.